రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్... ముగ్గురికి బాలీవుడ్ లో చిన్నచూపు
టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సౌత్, నార్త్ అనే గీతలను చెరిపేసి సినిమాలు చేస్తున్నారు. ఇండియాలోని అన్ని వర్గాల ప్రేక్షకులను, అన్ని భాషల ఆడియెన్స్ లను అలరిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం తర్వాత తెలుగు సినిమాలకు మరింత ఖ్యాతీ పెరిగింది. తెలుగు హీరోలుగా ప్రపంచం మెచ్చే సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి బడా హీరోల నుంచి వరల్డ్ ఆడియెన్స్ మెచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇదే టాలీవుడ్ స్టార్స్ తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు, ఇతర భాషలోని నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి.
ఇదే సమయంలో ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చనప్పుడల్లా ఏదోక వెలితి కనిపిస్తూనే ఉంది. హీరోగా మన వాళ్లు ఎంతో హైప్ గా బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నా ఆ సినిమాలు మాత్రం ఎంతమాత్రమూ మంచి సక్సెస్ ను అందుకోవడం లేదు. 2013లో రామ్ చరణ్ జంజీర్ అనే చిత్రంతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సాన్నిహిత్యం మేరకు సల్మాన్ ఖాన్ చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.

ఇక 10 ఏళ్ల తర్వాత 2023లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రామయాణం చిత్రాన్ని తెరకెక్కిస్తామని ఆఫర్ అందింది. దాంతో ప్రభాస్ ఆ ప్రాజెక్ట్ లో నటించారు. కానీ అవుట్ పుట్ మాత్రం మరీ దారుణంగా ఉండింది. రాముడిగా ప్రభాస్ లుక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. విమర్శల పాలయ్యారు. ప్రభాస్ సినిమాలపై ఉన్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు తారక్. అయితే ఈ చిత్రంతోనూ ఎన్టీఆర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ స్వాగ్ కు తగిన సన్నివేశాలేవీ పడలేదని, పైగా తమ అభిమాన హీరోను చూపించిన లుక్స్ ఏమాత్రం బాగోలేవని ఫ్యాన్సే అభిప్రాయపడుతుండటం గమనార్హం. వార్ 2 చిత్రానికి కూడా మిక్స్డ్ టాక్ అందింది. ఇలా బాలీవుడ్ కు టాలీవుడ్ స్టార్స్ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి ఏదోలా విఫలయత్నం జరుగుతూనే వస్తోంది. మరోవైపు రీసెంట్ గా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకరు సౌత్ సినిమాలను తలకెక్కించుకోవద్దని, సైయారా వంటి సినిమాలే హిందీ ఫ్లేవర్ అని చెప్పడం చర్చగా మారింది. ఇక టాలీవుడ్ స్టార్స్ మన ప్రొడక్షన్స్ లోనే అద్భుతంగా చూపించగలరని అభిప్రాయపడుతున్నారు.
ఇక నెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి డ్రాగన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలను కంప్లీట్ చేస్తున్నారు. ది రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











