RC15: రామ్ చరణ్ మూవీలో మరో స్టార్ హీరో.. ఊహించని పాత్రతో సర్‌ప్రైజ్
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. సుదీర్ఘ కాలంగా వరుస సినిమాలతో హవాను చూపిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. క్రమంగా తన ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటోన్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే అతడు RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేషనల్ రేంజ్‌లో సత్తా చాటుతోన్న దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ మూవీతో అతడు మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ మూవీతో అతడి క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. కానీ, తర్వాత వచ్చిన 'ఆచార్య' మాత్రం బిగ్ షాక్ ఇచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు దేశమే మెచ్చిన దిగ్గజ దర్శకుడు శంకర్‌తో కలిసి ఓ సినిమాను చేస్తున్న సంగతి విధితమే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతూ వస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 50 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. అలాగే, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగాన్ని షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికోసం సెట్‌లను కూడా నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో కూడా భాగం అయినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌లో రామ్ చరణ్‌ను ప్రోత్సహించే ఓ విప్లవకారుడి పాత్ర ఉంటుందట. దీనికోసమే ఆ హిందీ హీరోను తీసుకుంటున్నట్లు తెలిసింది. అయితే, ఆ హీరో పేరు మాత్రం బయటకు రాలేదు. కానీ, సంజయ్ దత్ లేదా అజయ్ దేవగణ్‌లలో ఒకరు ఈ పాత్రను చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకు 'సిటిజన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.


Click it and Unblock the Notifications











