Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సినీ కార్మికులకు అండగా.. ‘సీసీసీ’కి బ్రహ్మానందం విరాళం
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ ధాటికి భారత దేశం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పటికే ఆరు వేలకు పైగా కరోనా కేసుల నమోదు కాగా.. రెండు వందల మంది వరకు ప్రాణాలను కోల్పోయారు. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా 21 రోజుల లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు ఎవ్వరూ కూడా ఇంట్లోంచి బయటకు రాకూడదని సూచించిన విషయం తెలిసిందే.
ఈ నిర్ణయంతో అన్ని కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమ మూత పడటంతో రోజూ వారి కూలీలు రోడ్డున పడ్డట్టు అయింది. సినీ శ్రామికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చాడు. కోటి రూపాయల విరాళాన్ని ముందుగా ప్రకటించి.. ఆపై కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి తోటీ హీరోలకు కూడా పిలుపునిచ్చాడు. దీంతో విరాళాలు వెల్లువెత్తాయి.

యంగ్ హీరోలంతా కదిలివచ్చారు. అందరూ తమకు తోచిన సాయాన్ని చేశారు. ప్రభాస్, మహేష్ బాబు, దగ్గుబాటి ఫ్యామిలీ, మెగా హీరోలు, యంగ్ హీరోలంతా తమకు తోచినంత ఆర్థిక సాయాన్ని చేసి సినీ కార్మికులకు అండగా నిలబడ్డారు. తాజాగా ఈ సీసీసీకి బ్రహ్మానందం విరాళాన్ని అందించాడు. సినీ శ్రామికులను అండగా ఉండేందుకు మూడు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు.