కెనడాలో థియేటర్‌పై పెట్రోల్ పోసి.. కాల్పులు.. కాంతార చాప్టర్ 1, OG షోలు రద్దు
ఇటీవల సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం రిలీజ్‌కు ముందు కెనడాలో తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఓజీ నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్‌కు, కెనడాలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ మార్క్ సినిమాస్‌కు మధ్య వివాదం కారణంగా అసలు ఓజీ కెనడాలో రిలీజ్ అవుతుందా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే వివాదం సమసిపోవడంతో ఓజీ రిలీజ్ కావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఓజీ షోలు కెనడాలో ఉన్నపళంగా రద్దయ్యాయి. ఓజీతో పాటు రెండ్రోజుల క్రితం రిలీజైన కాంతార చాప్టర్ 1, ఇతర భారతీయ చిత్రాల స్క్రీనింగ్ నిలిచిపోయింది. ఈ వివరాల్లోకి వెళితే..
కెనడాలో భారతీయుల హవా
భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో కెనడా కూడా ఒకటి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల క్రితం కెనడా గడ్డపై భారతీయులు అడుగుపెట్టారు. అమెరికాకు పొరుగునే ఉండటంతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టడానికి కెనడాను దగ్గరి దారిగా భావించే వారున్నారు. ప్రస్తుతం అక్కడ భారతీయులు అతిపెద్ద సమూహాంగా నిలిచారు. అయితే గత కొంతకాలంగా కెనడాలో పరిస్ధితులు అదుపు తప్పుతున్నాయి. దీనికి భారత సంతతి ప్రజలే కారణమవుతున్నారే ఆరోపణలు ఉన్నాయి.

రెచ్చిపోతోన్న ఖలిస్తాన్ మద్ధతుదారులు
ముఖ్యంగా పంజాబ్‌ను భారతదేశం నుంచి విడదీసి ప్రత్యేకంగా ఖలిస్తాన్ దేశాన్ని ప్రకటించాలంటూ దశాబ్ధాలుగా అక్కడ పోరాటం జరుగుతోంది. పంజాబ్‌లో ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని భారత ప్రభుత్వం అణచివేయగా.. కెనడా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల నుంచి సిక్కులు ఉద్యమాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. అయితే గత కొద్దినెలలుగా ఈ ఉద్యమం హింసాత్మకంగా మారుతోంది. ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాతి నుంచి ఖలిస్తాన్ వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారు.
భారతీయులే టార్గెట్
భారత రాయబార కార్యాలయాలతో పాటు హిందూ దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఆలయాలపై పిచ్చిరాతలు రాయడం, కెనడాలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు, ఖలిస్తాన్ రిఫరెండంలతో కెనడాలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ఇక పలువురు భారత సంతతి ప్రముఖుల ఇళ్లపై కాల్పులు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం కపిల్ శర్మకు చెందిన రెస్టారెంట్‌పై రెండుసార్లు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డాడరు. తాజాగా అల్లరి మూకలు భారతీయ సినిమాలు ప్రదర్శించే థియేటర్లను టార్గెట్ చేశారు.
ఓజీ, కాంతార 1 సినిమాలు రద్దు
సెప్టెంబర్ 25న ఒంటారియో ప్రావిన్స్‌లో ఓ థియేటర్ కారిడార్‌లో ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు పెట్రోల్ వంటి రసాయనం చల్లి నిప్పంటించడం కలకలం రేపింది. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీన ముసుగులో వచ్చిన మరో వ్యక్తి ఏకంగా థియేటర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. భారతీయ చిత్రాలను ప్రత్యేకించి దక్షిణాది చిత్రాలు ప్రదర్శిస్తోన్న థియేటర్లను టార్గెట్ చేసుకుని దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఓక్‌విల్లేలో ఓజీ, కాంతార చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను నిలిపి వేస్తున్నట్లు ఫిల్మ్. సీఏ సినిమాస్ తెలిపింది. అలాగే ఆన్‌లైన్ బుకింగ్ లిస్ట్ నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించినట్లు యార్క్ సినిమాస్ తెలిపింది. గ్రేటర్ టోరంటోతో పాటు బ్రిటీష్ కొలంబియా, అల్బెర్టా, క్యూబెన్, మానిటోబా ప్రావిన్స్‌లలోనూ భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని అక్కడి థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. థియేటర్‌లపై దాడుల వెనుక ఖలిస్తాన్ వర్గీయుల ప్రమేయడం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


Click it and Unblock the Notifications











