దాసరి అప్పు, డబ్బులు అడిగితే చంపేస్తామంటూన్నారు.. కుమారులపై క్రిమినల్ కేసు!

అనూహ్యంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు పేరు వార్తల్లోకెక్కింది. తాజాగా సినీ దర్శకుడు దివంగత దాసరి నారాయణరావు కుమారుల మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాసరి నారాయణరావు గతంలో తీసుకున్న అప్పు చెల్లిస్తామని దాసరి కుమారులు ఇద్దరు ఒప్పుకున్నారని అయితే ఇప్పుడు ఆ అప్పూ తీర్చుకుండా ఇబ్బందులు పెడుతున్నారని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు బాధితులు. 2012లో రెండు కోట్ల పది లక్షల రూపాయల డబ్బును దాసరి నారాయణరావు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ అప్పు ఇప్పటికీ తీర్చకపోతే 2018 నవంబర్ 13వ తేదీన దాసరినారాయణరావు తీసుకున్న అప్పు ని చెల్లిస్తామని ఆయన కుమారుడు దాసరి అరుణ్, దాసరి ప్రభు పెద్దమనుషుల సమక్షంలో మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

రెండు కోట్ల పది లక్షల రూపాయలు అప్పు తీసుకోగా అంత తాము అంత ఇచ్చుకోలేనని కోటి 15 లక్షలు మాత్రమే ఇవ్వగలమని దాసరి కుమారులు ఇద్దరు పేర్కొనగా అందుకు అప్పిచ్చినవారు ఒప్పుకున్నారు కూడా. అయితే దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఆ కోటి 15 లక్షల రూపాయలు కూడా ఇంకా తమకు ఇవ్వడం లేదని ఒప్పందం ప్రకారం డబ్బు ఎందుకు చెల్లించడం లేదు అని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతూ సోమశేఖర్ అనే బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిజానికి ఈ నెల 27వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46 లో ఉన్న దాసరి నివాసానికి వెళ్లి ఆయన కుమారులను సోమశేఖర్ డబ్బు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

Case filed on dasari Narayana Rao sons dasari Arun Kumar and dasari Prabhu

అయితే మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామని దాసరి నారాయణరావు కుమారులు ఆయనను బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారి మీద కేసు పెట్టగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే నిజానికి దాసరి కుమారుల మధ్య కూడా ఆస్తికి సంబంధించిన గొడవలు జరుగుతూ ఉండేవి. దాసరి నారాయణ రావు కోడలు కూడా అడపాదడపా మీడియా ముందుకు తమ ఆస్తుల పంపకం వ్యవహారంలో మోహన్ బాబు చొరవ తీసుకోవాలని, తమ మామయ్య చనిపోయిన సమయంలో ఈ విషయంలో ఆయన చొరవ తీసుకుంటా అని మాట ఇచ్చారని ఇప్పుడు తమను పట్టించుకునే నాధుడే లేకుండా పోతున్నారని ఆమె ఆరోపిస్తూ ఉంటారు. ఇక దాసరి కుమారుడు అరుణ్ కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు అలాగే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో కనిపించారు. మరి ఈ వ్యవహారం అంతా కి వెళుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X