యంగ్ హీరోయిన్‌కి వింత జబ్బు.. విజయ్ దేవరకొండ పక్కన చేరి! పెళ్లికి కూడా..!

హీరోయిన్ల గురించి ఏ విషయం బయటకొచ్చినా, అది ఎలాంటిదైనా వైరల్ అవడం కామన్. ఈ నేపథ్యంలోనే యంగ్ హీరోయిన్‌ కేథరిన్ విషయమై ఓ సీక్రెట్ బయటపడటం, అది కాస్తా వైరల్ కావడం చకచకా జరిగాయి. పైగా ఆ సీక్రెట్ స్వయంగా కేథరిన్ చెప్పడంతో షాకవుతున్నారు ప్రేక్షకులు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించి ఫాలోయిన్ పెంచుకుంది హీరోయిన్ కేథరిన్. ముఖ్యంగా అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో నటించి భేష్ బిపించుకుంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేథరిన్ తాను కొంతకాలంగా ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరికీ షాకిచ్చింది. ఆ వ్యాధి కారణంగా తాను ఏ వాసన పసిగట్టలేక పోతున్నానని స్వయంగా తెలిపింది కేథరిన్.

Catherine Tresa suffering with Rare Disease

అది సువాసన అయినా, చెడు వాసన అయినా అది తనకు మాత్రం ఎలాంటి అనుభూతిని కలిగించదని కేథరిన్ చెప్పేసింది. ఈ జబ్బును అనోస్మియా అంటారని, ఇది అత్యంత అరుదైన వ్యాది అని, లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్య ఎదురవుతుందని ఆమె తెలిపింది. తనకు ఈ సమస్య చాలా కాలంగా ఉన్నప్పటికీ ఎవరితో షేర్‌ చేసుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది.

తాను ఈ వ్యాధితో బాధపడుతూ వాసన పసిగట్ట లేకపోతుండడం కారణంగా భవిష్యత్తులో పెళ్లికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కేథరిన్ పేర్కొనడం గమనార్హం. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కేథరిన్.. విజయ్ దేవరకొండ సరసన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాలో నటిస్తోంది. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X