ఎన్టీఆర్ నిజ స్వరూపం బయటపెట్టిన ఫిష్ వెంకట్.. ఎన్ని చేసినా ఒక్కటి బయటకు రాలేదు.. చెల్లి పెళ్లికి పిలిస్తే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మిగతా వారి సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ మాత్రం తన 100% టాలెంట్ తోనే సోలోగా ఎదిగాడని చెప్పవచ్చు. నతనతోనే కాకుండా డ్యాన్స్ యాక్షన్ సింగింగ్ ఇలా అన్నిట్లోనూ బెస్ట్ అనిపించుకున్నాడు.
ఇక స్థాయి ఎంత పెరిగినా కూడా ఎన్టీఆర్ గుణంలో మాత్రం ఇంకా అలానే ఉన్నట్లు చెబుతుంటారు. ఎదుటి మనుషులు నచ్చితే అంత ఈజీగా వదిలి పెట్టడని కష్టం ఉందని తెలిస్తే అడగకపోయినా సహాయం చేస్తాడని అంటారు. ఇక ఇటీవల జూనియర్ మంచితనం యొక్క నిజం స్వరూపం గురించి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కూడా వివరణ ఇచ్చాడు.

దారుణంగా ప్లాప్ అవ్వడంతో
నిజానికి జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని బాక్సాఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అవ్వడంతో హీరోగా సెట్టవ్వడని కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ తారక్ మాత్రం నిరాశ చెందకుండా తన కష్టాన్ని నమ్ముకొని తెరపైకి వచ్చాడు. అదృష్టవశాత్తూ కెరీర్ మొదట్లోనే ఎస్ఎస్.రాజమౌళి, వివి.వినాయక్ వంటి వారి ద్వారా హిట్స్ అందుకోవడంతో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

స్టార్ స్టేటస్ ను సైతం పక్కన పెట్టి
స్టూడెంట్ నెంబర్ 1, ఆది సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఎన్టీఆర్ తన సినిమాలో నటించే ప్రతి ఒక్కరిని కూడా ఓకే రకంగా గౌరవిస్తాడు. స్టార్ స్టేటస్ ను సైతం పక్కన పెట్టి తమతో ఎంతో సరదాగా నవ్వుకుంటూ ఉంటాడని నటీనటులు చెబుతుంటారు.

ఎన్ని సహాయలు చేసినా..
అయితే ఒక ఇంటర్వ్యూలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ కూడా ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని విషయాలను చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆది సినిమా నుంచి ఎన్టీఆర్ తో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని అతను తెలియకుండానే ఎంతోమందికి సహాయం చేశారని అయితే ఎన్ని సహాయలు చేసినా కూడా వాటిని బయటకు తెలియనిచ్చే వారు కాదని వెంకట్ చెప్పాడు.

చెల్లి పెళ్లి కోసం వెళితే.. డబ్బు ఇచ్చారు
ఫిష్ వెంకట్ మాట్లాడుతూ.. మా చెల్లి పెళ్లి ఉందని అప్పట్లో ఎన్టీఆర్ ను పిలవడానికి వెళ్ళాను. కానీ ఆ టైమ్ లో నరసింహుడు, అశోక్, రాఖీ వంటి సినిమాలు వరుసగా డిజాస్టర్ అవ్వడంతో అప్సెట్ లో ఉన్నారు. పెళ్లికి రమ్మని అన్నప్పుడు సున్నితంగానే ఇప్పుడు ఏం వస్తామని చెప్పేశాడు. కానీ చెల్లి పెళ్లి అనగానే 20 వేల రూపాయలు ఇచ్చారు. నేను వద్దు అని చెప్పినా కూడా తీసుకొమ్మని ప్రేమగా బెదిరించాడు.. అని ఫిష్ వెంకట్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











