80's Reunion: చిరంజీవి, వెంకటేష్ అందరూ అలా.. రజనీకాంత్ ఇలా..

చెన్నైలో 80s స్టార్స్ రీయూనియన్ జోష్!
సినీ సెలబ్రెటీలు ఒక్కచోటకు చేరారు. 80వ దశకానికి చెందిన అగ్రనటులందరూ ఒకేచోట కలిసి ఎంతో ఘనంగా రీయూనియన్‌ (The 80s Stars Reunion)పేరిటి పార్టీ చేసుకున్నారు. అక్టోబర్‌ 4న చెన్నైలో గ్రాండ్ లెవల్ లో గెట్‌ టు గెదర్‌ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ జంట రాజ్‌కుమార్‌ సేతుపతి- శ్రీప్రియ తమ ఇంట్లోనే జరిగిన ఈ పార్టీకి టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, వెంకటేశ్, నరేశ్, కోలీవుడ్‌ నుంచి శరత్‌కుమార్, రాధ, నదియా, సుహాసిని, మీనా, జయసుధ, రమ్యకృష్ణ, బాలీవుడ్‌ నుంచి జాకీ ష్రాఫ్ ఇలా దాదాపు 31 మంది సినీ తారలు ఈ వేదికలో కలుసుకున్నారు.

"చీతా ప్రింట్స్" థీమ్ తో జరిగిన ఈ సెలబ్రెషన్స్ లో చిరుత ముద్రలతో కూడిన డ్రెస్సుల్లో సెలబ్రెటీలు మెరిసిపోయారు. ఈ పార్టీలో సెలబ్రిటీలందరూ సంతోషంగా గడుపుతూ ఎంజాయ్ చేశారు. తమ ఓల్డ్ మెమోరీస్ ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఈ వేడుక ఫోటోలను షేర్ చేస్తూ.. "ప్రతి రీయూనియన్‌ ఒక మధుర జ్ఞాపక యాత్రలా ఉంది. ఎన్ని సార్లు కలిసినా కొత్త ఉత్సాహం, కొత్త ఆనందం "అని ట్వీట్ చేశారు. ఈ రీయూనియన్‌ సంప్రదాయం 2009లో లిస్సీ, సుహాసిని ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఏడాది సౌత్ ఇండియా సినీ తారలు కలుసుకొని స్నేహాన్ని, ఐక్యతను జరుపుకుంటున్నారు. 2019లో చిరంజీవి తన నివాసంలో ఈ వేడుకను నిర్వహించగా, ఈసారి చెన్నైలో మళ్లీ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

Chennai 80s Stars Reunion Chiranjeevi Venkatesh Celebrate Rajinikanth in Himalayas

హిమాలయాల్లో రజనీకాంత్...
ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. ఆయన మాత్రం ఈ గ్లామర్‌ గ్యాదరింగ్‌కు దూరంగా ఉన్నారు. ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించారు. ఈ రంగుల ప్రపంచానికి దూరంగా.. హిమాలయాలలో ప్రశాంత గడపడానికి వెతుకుతున్నారు. ఇటీవలే 'కూలీ'సినిమా ప్రేక్షకుల ముందు వచ్చిన రజినీకాంత్.. త్వరలో 'జైలర్ 2'లో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పెట్టి.. మానసిక ప్రశాంతత కోసం యాత్ర చేపట్టారు. రిషికేశ్‌లోని ఆశ్రమంలో బసచేస్తూ.. బద్రీనాథ్, మహావతార్ బాబాజీ గుహ వంటి పవిత్ర స్థలాలను దర్శించారు.

ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రజనీకాంత్ రోడ్డు పక్కన ఓ సామాన్యుడిలా సాధారణ భోజనం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం రజనీకాంత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రజనీ సింపుల్ లైఫ్ మరోసారి అభిమానుల అట్రాక్ట్ చేసింది. రజనీ మాట్లాడుతూ, "ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం నాకు కొత్త అనుభవం ఇస్తుంది. ఆధ్యాత్మికత మనిషికి సమతుల్యతను ఇస్తుంది. భగవంతుడిపై విశ్వాసమే జీవితం యొక్క నిజమైన ప్రశాంతత" అని పేర్కొన్నారు.

ఒకవైపు మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌, రమ్యకృష్ణ, నదియా వంటి స్టార్‌లు 80s జ్ఞాపకాలతో మునిగిపోతుంటే... మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ భగవంతుడిని స్మరించుకుంటూ హిమాలయాల నడుమ ధ్యానం చేస్తున్నారు. సెలబ్రెటీలు పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంటే.. రజనీకాంత్ మాత్రం ప్రశాంతత, ఆధ్యాత్మికత అంటూ.. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. మరోసారి తన రేటే సపారేట్ అని సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి నిరూపించారు.

More from Filmibeat

Read more about: rajinikanth venkatesh chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X