మెగా 152: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోహన్ బాబు లుక్
ఇటీవలే 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో సక్సెస్ సాధించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో మోహన్ బాబు కీలక రోల్ పోషిస్తున్నారని సమాచారం. అయితే తాజాగా మోహన్ బాబుకు సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

దేవాలయాల్లో అవినీతి.. కొరటాల కథ
సామాజిక అంశాలను ఎలివేట్ చేస్తూ సినిమాలు తీయడంలో దిట్ట అయిన కొరటాల శివ.. చిరంజీవి 152 కోసం కూడా బలమైన కథ ఎంచుకున్నారు. దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బేస్ చేసుకొని కథ రాసుకున్న ఆయన.. ఇటీవలే ఈ కథను సెట్స్ పైకి తీసుకొచ్చారు. దీనికోసం చిరంజీవి కూడా సరికొత్తగా మేకోవర్ అయ్యారు.

విలన్ మోహన్ బాబు.. ఎంట్రీకి రెడీ
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కోకాపేటలో వేసిన భారీ సెట్స్ పై చిరంజీవి పార్ట్ షూటింగ్ చేస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమా సెట్స్ పైకి మోహన్ బాబు త్వరలోనే రాబోతున్నారని తెలుస్తోంది. ఇందులో ఆయన విలన్ రోల్ పోషించనున్నారని టాక్.

చిరంజీవి, మోహన్ బాబు మెగా పోస్టర్స్
ఈ నేపథ్యంలో మోహన్ బాబుకు సంబంధించిన ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు చిరంజీవి, మోహన్ బాబులతో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవలే జరిగిన 'మా' ఈవెంట్ లో ఈ ఇద్దరూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం, ఇప్పుడు సెట్స్ పై కలవబోతుండటం జనాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇరువురి అభిమానుల్లో ఉత్సాహం..
గతంలో చిరంజీవితో కలిసి చాలా సినిమాల్లో నటించిన మోహన్ బాబు.. ఎక్కువగా విలన్ రోల్స్ పోషించి మెప్పించారు. చివరిగా 'కొదమసింహం' సినిమాలో నటించారు. మళ్ళీ చాలా ఏళ్ల తరువాత మోహన్ బాబు, చిరంజీవి తెరపంచుకోనుండటం ఇరువురి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

చిరంజీవి సరసన త్రిష.. గోవింద ఆచార్య
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మెగా 152 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ పరిశీలనలో పెట్టింది చిత్రయూనిట్. ఆగస్ట్ 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుంచేలా టార్గెట్ పెట్టుకున్నారు కొరటాల శివ.


Click it and Unblock the Notifications











