For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Chiranjeevi: అంచనాలు పెంచిన ప్రీ లుక్.. బాబీ మూవీలో ఆ గెటప్‌లో చిరంజీవి

  |

  కరోనా ప్రభావం సినీ రంగంపై భారీ స్థాయిలో చూపించిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లు మూతపడి చాలా సినిమాలు ఆగిపోవడంతో దర్శక నిర్మాతలు ఎంతో నష్టం వాటిల్లింది. దీంతో హీరోలు కూడా మూవీలు ఆగిపోయి ఇబ్బందులు పడ్డారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రమే లాక్‌డౌన్ సమయాన్ని తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం వాడుకున్నారు. ఈ గ్యాప్‌లోనే ఎంతో మంది దర్శకులు చెప్పిన కథలను విన్నారు. ఇలా మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. అలా చిరంజీవి ఫైనల్ చేసిన దర్శకుల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఒకడు.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  బాబీతో మెగాస్టార్ చిరంజీవి సినిమాను చేస్తున్నారన్న విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత నిర్మాణ సంస్థ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇటీవలే డైరెక్టర్ బాబీ పుట్టినరోజు జరుపుకున్నాడు. దీన్ని పురస్కరించుకుని అతడికి సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పిలిచారు. అంతేకాదు, బర్త్‌డే సందర్భంగా ఓ కానుకను కూడా అందించారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఈ యంగ్ డైరెక్టర్.. సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు.

   Chiranjeevi and K. S. Ravindra Movie Pre Look Released

  ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ బాబీ. అతడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా అనగానే ఈ కాంబోపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి కూడా రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను చిరంజీవి పుట్టినరోజు అంటే ఈరోజు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ శనివారమే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ విడుదలైంది.

  Happy Birthday Chiranjeevi: చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా.. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

  ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్టు 22 సాయంత్రం 4.07 గంటలకు బాబీ, చిరంజీవి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో మెగాస్టార్ ఫుల్ మాస్ అవతారంతో కనిపించాడు. లుంగీని పైకి కట్టి.. నోట్లో బీడీ పెట్టి బోటు మీద నిల్చుని ఉండగా.. పక్కనే ఉన్న కొందరు దాన్ని సంద్రంలోకి తోస్తున్నారు. చాలా కాలంగా చిరంజీవిని ఆయన అభిమానులు ఎలా చూడాలనుకున్నారో.. అంతకు మించేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇందులో ఆయన లుక్ పాత మెగాస్టార్‌ను గుర్తుకు తెచ్చేలా ఉంది. దీంతో ఇది తెగ వైరల్ అవుతోంది.

  ఈ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. 'పూనకాలు లోడింగ్' అనే క్యాప్షన్ ఇచ్చి అంచనాలను రెట్టింపు చేసేసింది. ఇదిలా ఉండగా.. బాబీ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకూ అతడు చేసిన ప్రతి సినిమా అలాగే ఉంది. ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమా కూడా అదే మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ ఓ స్టార్ హీరోకు, అభిమానికి మధ్య జరిగే కథతో రూపొందుతుందట. ఈ విషయాన్ని తాజాగా బాబీ కూడా రివీల్ చేసేశాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  English summary
  Megastar Chiranjeevi Now Doing Acharya with Koratala Shiva. After That He will do a Movie Under K. S. Ravindra Direction. Now This Movie Pre Look Poster Released.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X