For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiru154: చిరంజీవి - బాబీ మూవీపై ఊహించని న్యూస్.. మెగా అభిమానులకు ఇక పండగే

  |

  ఆరు పదుల వయసులోనూ రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభం నుంచీ కాస్త నెమ్మదిగానే సినిమాలు చేసిన ఆయన.. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహా రెడ్డి' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక, ప్రస్తుతం ఆయన రామ్ చరణ్‌తో కలిసి బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా దాదాపుగా పూర్తైపోయింది.

  Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్‌ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!

  'ఆచార్య' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన మలయాళ సూపర్ హిట్ సినిమా 'లూసీఫర్'ను 'గాడ్ ఫాదర్' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. దీని అనంతరం మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో బంపర్ హిట్ అయిన 'వేదాళం' చిత్రాన్ని 'భోళా శంకర్'గా తెలుగులోకి రీమేక్ అనువాదం చేస్తున్నారు. ఇవన్నీ పూర్తైన తర్వాత చిరంజీవి.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరొందిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేయనున్నారు. ఈ ప్రకటన ఇటీవలే వచ్చింది.

  డైరెక్టర్ బాబీ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకూ అతడు చేసిన ప్రతి సినిమా అలాగే ఉంది. ఇప్పుడు చిరంజీవితో చేసే సినిమా కూడా అదే మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ ఓ స్టార్ హీరోకు, అభిమానికి మధ్య జరిగే కథతో రూపొందుతుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా సినిమా హీరో, అభిమాని మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా రూపొందనుంది. ఆ హీరో పాత్రను చిరంజీవి చేస్తుండగా.. అభిమాని రోల్ కోసం మరో యంగ్ హీరోను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం హీరోల పేర్లు పరిశీలిస్తున్నారని టాక్.

  అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  Chiranjeevi and K. S. Ravindra Movie Starts From November 6th

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా పట్టాలెక్కేంచే ముందే.. దీనికి సంబంధించిన కాస్టింగ్‌పై అప్పుడే దృష్టి సారించాడు దర్శకుడు బాబీ. ఇందులో భాగంగానే ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించే హీరోయిన్ గురించి వెతుకులాట మొదలెట్టాడట. ఇందులో ఫీమేల్‌ లీడ్‌గా నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్లు తెలిసింది. అలాగే మరికొందరిని కూడా ఫైనల్ చేశాడట. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం నవంబర్ 6న అధికారికంగా ప్రారంభం కాబోతుందట. ఆరోజు భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత కొద్ది రోజులకు షూటింగ్ కూడా మొదలు పెడతారని తెలిసింది.

  క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రీ లుక్ పోస్టర్ విడుదల కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి.

  English summary
  Megastar Chiranjeevi will do a Movie Under K. S. Ravindra Direction. This Movie Will Starts From November 6th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X