Mega157: మెగా157 టైటిల్ లీక్.. కుర్ర హీరోపై అనిల్ రావిపూడి ఫైర్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నెక్స్ట్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రాల్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మెగా 157 ప్రాజెక్టు ఒకటి. మరోవైపు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం కూడా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్ట్స్ నుంచి ఎప్పుడెప్పుడు ఇంట్రెస్టింగ్ గా అప్డేట్స్ వస్తాయా అని ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో మెగా 157 చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని దర్శకుడు అని రావిపూడి అందించడం విశేషం. తాజాగా అనిల్ రావిపూడి మూవీ ఈవెంట్ కి హాజరయ్యారు. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో ఫేమ్ అయిన కుర్ర హీరో మౌలి తనుజ్ ప్రశాంత్ హీరోగా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా కుర్ర హీరో అనిల్ రావిపూడిని మెగా157 టైటిల్ గురించి అడిగారు. అంతకంటే ముందు మెగా 157 టైటిల్ పై కొందరు ఇలా చేస్తున్నారని పలు టైటిల్స్ ను చెప్పారు.

Chiranjeevi Anil Ravipudi Mega 157 Movie Title Leak

నటుడు మౌలి మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఇక బాస్ మెగాస్టార్ తో మీరు చేస్తున్న సినిమాపై ఇలాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. సంక్రాంతికి క్రొకడైల్ ఫెస్టివల్, సంక్రాంతికి రఫాడిస్తా, సంక్రాంతికి శంకర్ దాదా కమింగ్' అని చెప్పడంతో అనిల్ రావిపూడి ఫైర్ అయ్యారు. ఇంకో టైటిట్ చెబితే ఏమాత్రం బాగుండదని ఫైర్ అయ్యాడు. అసలు టైటిల్ లో లేదని చెప్పాడు. ఏమాత్రం పోలికలేని టైటిల్స్ ను చెప్పి కోపం తెప్పించొద్దన్నట్టు కుర్ర హీరో నోరు మూయించాడు.

ఇక యాంకర్ అనిల్ రావిపూడిని మెగా 157 టైటిల్ అప్డేట్ ను అడిగారు. ఆగస్టు 21న బాస్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ రిలీవ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమేనా అని అడగటంతో .. అనిల్ రావిపూడి నిజమేనని చెప్పారు. దీంతో మెగా ఫ్యాన్స్ రేపు మెగా157 నుంచి వచ్చే అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి హీరోలకు తగ్గట్టుగా టైటిల్స్ ను సెట్ చేస్తూ ఉంటారు. ఇక చిరంజీవితో సినిమాకు ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారనేది ఆసక్తికరంగా మారింది.

మెగా 157 చిత్రాన్ని షైన్ స్క్రీన్, గోల్డ్ బాక్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి కూతురు కొణిదెల సుష్మితా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే మూవీ 2 షెడ్యూల్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 3వ షెడ్యూల్ కూడా కొనసాగుతోందని తెలుస్తోంది. చిత్రంలో హీరోయిన్ గా లేడీ పవర్ స్టార్ నయనతార నటిస్తుండటం విశేషం. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X