Don't Miss!
- News
Budget 2023: మొత్తం బడ్జెట్లో 13 శాతం వాటా ఈ రంగానిదే..!!
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Chiranjeevi: ఫ్యాన్స్‌కు చిరంజీవి మరో గిఫ్ట్.. కొత్త సినిమా రిలీజ్‌పై క్లారిటీ
ప్రజా సేవ చేయడం కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి ఆయన మరింత ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే చాలా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలోనే దక్కుతోంది. దీంతో ఈ మూవీ హడావిడి కనిపిస్తోంది.
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!
చాలా రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవి పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కనున్న 'భోళా శంకర్' కూడా ఉంది. దీన్ని ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో బాగా హైలైట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు రెండు మూడు పాటలను కూడా కంప్లీట్ చేపుకున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీ షూటింగ్ అనుకున్నట్లుగా సాగకపోవడంతో దీనిపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'వాల్తేరు వీరయ్య' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి దీనిపై క్లారిటీ ఇచ్చారు. 'భోళా శంకర్ మూవీ షూటింగ్ 30 శాతం వరకూ పూర్తైంది. కొత్త షెడ్యూల్‌ను జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. దీన్ని వచ్చే మేలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ అప్పటికి కుదరకపోవడంతో దసరాకు రిలీజ్ చేయాలని నిర్ణయించాం' అని చెప్పుకొచ్చారు.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!
'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. ఇందులో తమన్నా భాటియా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే, ఈ మూవీలో మరో యంగ్ హీరో కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.