Covid Vaccine పై మెగాస్టార్ చిరంజీవి ఫోకస్.. త్వరలోనే టాాలీవుడ్‌లో అందరికీ!

దర్శకరత్న దాసరి నారాయణరావు కన్నుమూసిన తర్వాత చిరంజీవి టాలీవుడ్ మొత్తానికి తను పెద్ద గా వ్యవహరిస్తున్నారు.. టాలీవుడ్ లో ఎలాంటి సమస్యలు వచ్చినా నేనున్నానని అభిమానిస్తూ ఆయన అనేక విషయాల్లో టాలీవుడ్ కి అండగా నిలబడుతున్నారు.. గత ఏడాది కాలం కరోనా సమయంలో కూడా కరోనా క్రైసిస్ ఛారిటీ అనే ఒక సంస్థను నెలకొల్పి తాను ముందుగా విరాళం ఇవ్వటమే కాక తన సహచర నటులు అందరితో విరాళాలు ఇప్పించి లాక్ డౌన్ వలన ఇబ్బందులు పడుతున్న అనేక వందల మంది సినీ కార్మికులకు అండగా నిలబడ్డారు.

ఇప్పుడు ఆయన మరోసారి అదే బాటలో పయనిస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన దాదాపు అందరికీ వ్యాక్సినేషన్ వేయించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.. తన కోడలు ఉపాసనకు సంబంధించిన అపోలో హాస్పిటల్స్ సహకారంతో టాలీవుడ్ కి సంబంధించిన ఒక మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.. నిజానికి ఇప్పటికే ప్రభుత్వం వ్యాక్సినేషన్ వేయించలేమని చెబుతూ చేతులెత్తేసిన నేపథ్యంలో ఎవరికి వాళ్లు వ్యాక్సిన్ కొనుక్కుని వేసుకుంటున్న పరిస్థితి. కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో ఆ వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలి అంటే సినీ కార్మికులకు ఇబ్బంది అనే చెప్పాలి.

Chiranjeevi going to arrange a mega vaccination drive for tollywood

ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ చారిటీ సంస్థ ద్వారా వ్యాక్సిన్ వేయిస్తామని గతంలోనే చిరంజీవి ప్రకటించారు. ఇక కొద్ది రోజుల క్రితం రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ను పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకున్నాయి. వాటన్నిటినీ అపోలో సంస్థ కొనుగోలు చేసింది. అందుతున్న సమాచారం మేరకు కొద్ది రోజుల్లో చిరంజీవి ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కి సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెడితే షూటింగులు కూడా మొదలు పెట్టు కోవచ్చు అని మరో ఆలోచన కూడ టాలీవుడ్ పెద్దలు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో వీలైనంత త్వరగా ఈ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X