Don't Miss!
- Sports
INDvsNZ : గాయంతో టీ20 సిరీస్ యువ బ్యాటర్ దూరం?.. రిప్లేస్ చేసే సత్తా వీళ్లకే..!
- Lifestyle
కేవలం రెండు వారాల్లోనే వైట్ హెయిర్‌కి గుడ్‌బై చెప్పాలా? ఐతే దీన్ని ప్రయత్నించండి...
- News
జాతీయ జెండాకు, రాజ్యాంగానికి అవమానం: కేసీఆర్‌పై బండి సంజయ్, రఘునందన్ ఫైర్
- Finance
Adani Shares: మరక కడిగే పనిలో అదానీ.. నిన్న ఖండన నేడు రంగంలోకి.. ఏం జరుగుతోంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Chiranjeevi Ravi Teja: వాల్తేరు వీరయ్యలో 'ఇడియట్', ధమాకాలో 'ఇంద్ర'.. ప్లాన్ చేసి తీశారా?
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ ఏజ్ హీరోలకు సరిసమానంగా పోటీ ఇస్తూ జోష్ చూపిస్తున్నారు. అక్టోబర్ 5న విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో కమ్ బ్యాక్ హిట్ కొట్టిన చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిని ఈ సినిమాపై మంచి టాక్ వస్తోంది. ఇక మరోవైపు హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా సినిమాలు చేసే హీరో మాస్ మహారాజా రవితేజ. ధమాకా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ వాల్తేరు వీరయ్యలో కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీళ్లి ఇద్దరి సినిమాలకు సంబంధించిన సన్నివేశాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఆచార్య ఫ్లాప్ కాగా..
దాదాపు నాలుగు దశాబ్ధాలుగు తెలుగు చిత్రసీమలో తన హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ఆయన తనయుడు రామ్ చరణ్ తో కలిసి నటించిన ఆచార్య ఫ్లాప్ కాగా, గాడ్ ఫాదర్ మూవీ మాత్రం మంచి విజయం సాధించింది.

చిరంజీవి 154వ చిత్రంగా..
మెగాస్టార్
చిరంజీవి
154వ
చిత్రంగా
నటించిన
చిత్రం
వాల్తేర్
వీరయ్య.
బాబీ
అలియాస్
కేఎస్
రవీంద్ర
దర్శకత్వం
వహించిన
ఈ
సినిమాలో
పవర్
ఫుల్
పోలీస్
ఆఫీసర్
గా
మాస్
మహారాజా
రవితేజ
అలరించాడు.
సుమారు
22
ఏళ్ల
తర్వాత
ఈ
ఇద్దరు
స్టార్
హీరోలు
కలిసి
నటిస్తున్న
సినిమా
కావడంతో
వాల్తేరు
వీరయ్యపై
భారీగా
అంచనాలు
నెలకొన్నాయి.
అలాగే
టాలీవుడ్
బడా
నిర్మాణ
సంస్థ
మైత్రీ
మూవీ
మేకర్స్
బ్యానర్
లో
రూపొందడంతో
సినిమాపై
క్రేజీగా
బజ్
క్రియేట్
అయింది.

తెలంగాణ యాసతో..
ఇక వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులను అలరించింది. అలాగే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వాల్తేరు వీరయ్య మూవీ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ఒకరోజు ముందు విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో చిరంజీవి తన యాక్టింగ్, డైలాగ్ లతో ఆకట్టుకుంటే రవితేజ తెలంగాణ స్లాంగ్ తో అదరగొట్టాడు. ఇక ట్రైలర్ లో వైజాగ్ లో గట్టి వేటగాడు లేడని.. ఒక పులి పూనకాలతో ఊగుతుందట అంటూ రవితేజ ఎంట్రీ చూపించారు.

రవితేజ ఇడియట్ డైలాగ్..
ట్రైలర్ చివర్లో.. హలో మాస్టారు.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. ఒక్కొక్కనికి బాక్సులు బద్దలైపోతాయి.. అని చిరంజీవి డైలాగ్ రవితేజ చెప్పడం.. ఏంట్రా బద్దలయ్యేది.. ఈ సిటీకి నీలాంటి కమిషనర్ లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ ఇక్కడ వీరయ్య లోకల్.. అని రవితేజ ఇడియట్ డైలాగ్ ను చిరంజీవి చేత చెప్పించాడు డైరెక్టర్ బాబీ. ఇప్పుడు ఈ సన్నివేశంతో నెట్టింట్లో మాట్లాడుకునేందుకు టాపిక్ అయింది.

గూస్ బంప్స్ తెప్పించే సీన్..
వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ ఇడియట్ సినిమా సీన్ తోపాటు డైలాగ్ చెప్పించారు. అలాగే రవితేజ ఇటీవల సాలిడ్ హిట్ కొట్టిన ధమాకా మూవీలో ఇంద్ర సినిమా సన్నివేశం ఉంది. హీరోయిన్ సోనాలి బింద్రే కాశీలో చిరంజీవి దగ్గర ఉండటం, తర్వాత కూతురు కోసం తండ్రి ప్రకాష్ రాజ్ రావడం, అప్పుడు చిరంజీవి గురించి తెలిసిన ప్రకాష్ రాజ్ మాట్లాడటం గూస్ బంప్స్ తీసుకొచ్చింది. అదే సన్నివేశాన్ని సేమ్ అలాగే.. కొద్దిగా కామెడీ జొప్పించి ధమాకా చిత్రంలో రీ క్రియేట్ చేశారు.
అనుకుని ప్లాన్ చేశారా..
ఇప్పుడు
ఈ
రెండు
సన్నివేశాలను
ప్రస్తావిస్తూ
ఒకరి
సన్నివేశాన్ని
మరొకరు
రిక్రియేట్
చేశారు..
లెవెల్
అయిపోయిందని
మీమ్స్
చేస్తున్నారు
నెటిజన్స్.
అయితే
ఇలా
ఈ
సన్నివేశాలు
తెరకెక్కించడం
అనుకోకుండా
జరిగిందా..
లేదా
కావాలనే
డైరెక్టర్స్
కానీ,
హీరోలు
కానీ
ప్లాన్
చేసి
తీశారా
అని
నెటిజన్లు
అనుమానం
వ్యక్తం
చేస్తున్నారు.

22 ఏళ్ల తర్వాత..
ఇదిలా ఉంటే చిరంజీవి, రవితేజ కలిసి అన్నదమ్ములుగా ఇదివరకు నటించిన చిత్రం అన్నయ్య. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంలో అన్నదమ్ములుగా వీరిద్దరి నటనను అంత త్వరగా మర్చిపోలేం. ఇప్పుడు సుమారు 22 ఏళ్ల తర్వాత చిరంజీవి, రవితేజ అన్నదమ్ములుగా నటించడం విశేషం. అలాగే బాబీ దర్శకత్వంలో రవితేజ ఇదివరకు పవర్ సినిమా చేసిన విషయం తెలిసిందే. అందులో కూడా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆకట్టుకున్నాడు.