For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi : జగన్, కనికరించండి.. ఆ నలుగురిని చూసి అందరినీ ఇబ్బంది పెట్టొద్దు!

  |

  ఇప్పుడు టాలీవుడ్ మొత్తానికి అతి పెద్ద సమస్యగా మారిన ఆంధ్రప్రదేశ్ టికెట్ల వ్యవహారం మరి కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉందని అనుకుంటున్న తరుణంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అంటున్నారు. ఈ టికెట్ల వ్యవహారం గురించి చిరంజీవి బృందం సెప్టెంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అనూహ్య కారణాలతో ముఖ్యమంత్రితో భేటీ రద్దయింది. ఇప్పుడు మరో సారి చిరంజీవి అండ్ టీమ్ కి ఏపీ సిఎం నుంచి పిలుపు వచ్చినట్లు ప్రచారం జరగగా ఆ భేటీ కూడా రద్దయిందని అంటున్నారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

   జగన్ ను కలవాలని

  జగన్ ను కలవాలని

  ఆంధ్రప్రదేశ్ లో వకీల్ సాబ్ సినిమా సమయం నుంచి టికెట్ల వ్యవహారంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సినిమా బెనిఫిట్ షోలు భారీగా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి అమ్ముకుంటున్నారు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్లను, టికెట్ రేట్లను తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ఒక జీవో జారీ చేయడమే కాక గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, సిటీ ఇలా ప్రాంతాల వారీగా విభజిస్తూ రేట్లు కూడా నిర్ణయించింది. అయితే ప్రభుత్వం చెప్పిన ఈ రేట్లతో సినిమా థియేటర్లు నడిపించాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యజమానులు చెబుతున్నారు. ఈ మేరకు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి మాట్లాడి రావాలనే ఉద్దేశంతో వాళ్లందరూ గతంలో సినీ పెద్దలను కోరారు.

   జగన్ తో భేటీ లేనట్టే?

  జగన్ తో భేటీ లేనట్టే?

  వారి నుంచి ప్రెజర్ రావడంతో పాటు సినిమా రిలీజ్ విషయంలో సందిగ్ధత కొనసాగుతున్న క్రమంలో చిరంజీవి సహా టాలీవుడ్లో మరి కొందరు పెద్దలు ఏపీ సీఎం జగన్ తో కలిసి మాట్లాడి రావాలి అని భావిస్తుండగా సెప్టెంబర్ 4వ తేదీన ఒక అపాయింట్మెంట్ ఖరారైందని వార్తలు వచ్చాయి. ఏమయిందో ఏమో కానీ అనూహ్య పరిస్థితుల్లో ఆ అపాయింట్మెంట్ రద్దు అయ్యిందని అన్నారు. అయితే చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ మరోసారి ఖరారైందని ఈనెల 20వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, దిల్ రాజు, సురేష్ బాబు లాంటి టాలీవుడ్ పెద్దలు జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే అది కూడా క్యాన్సిల్ అయిందని అంటున్నారు.

  రేపు పేర్ని నానితో మీటింగ్

  రేపు పేర్ని నానితో మీటింగ్

  తాజా సమాచారం మేరకు రేపు ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారని అంటున్నారు. ఈ సమావేశంలో కేవలం సినిమా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ లు పాల్గొననున్నారని అంటున్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కోవిడ్ వల్ల సినిమా పరిశ్రమకు ఎదురైన ఇబ్బందులపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఆన్లైన్ టికెట్ పై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు అని మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాకు వెల్లడించారు. రేపటి సమావేశంలో ఆన్లైన్ సినిమా టికెట్ అంశం పై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

  మీరు కనికరించండి

  మీరు కనికరించండి

  అయితే ఈ రోజు అయితే ఎవరూ ఊహించని విధంగా లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి ఏపీ టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోయిందని అలా పెరిగి పోవడం వల్ల పెట్టిన రెవెన్యూ కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాము చేసిన విజ్ఞప్తికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని దానికి సంబంధించిన జీవో అయితే విడుదల కావాల్సి ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత జగన్ ను సభా ముఖంగా కోరుతున్నాం అని మొదలు పెట్టిన చిరంజీవి మీరు కనికరించండి మా విజ్ఞప్తులను స్పెషల్ గా తీసుకుని మాకు సరైన ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

  Prakash Raj Speech About MaaMembers | CineMAABidalu | MaaElections
  ఇబ్బంది పెట్టద్దు

  ఇబ్బంది పెట్టద్దు

  బయట వినిపించినట్లు ఏదో నలుగురు హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారని కానీ ఆ నలుగురికి మాత్రమే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్లు వస్తాయని, ఆ నలుగురు ని చూసి మిగతావాళ్లు అందరూ ఇబ్బంది పడే లాగా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆయన బహిరంగ విజ్ఞప్తి చేశారు. దయచేసి సభాముఖంగా వినమ్రంగా అడుగుతున్నాను ప్లీజ్ దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి మా అభ్యర్ధనలను పట్టించుకుని దానికి ఏదైనా పరిష్కార మార్గాన్ని సూచించాలని కోరారు. వస్తువులు సహా కాయగూరలు అన్నీ కూడా కొనేముందు చూస్తామని కానీ ఒక్క సినిమా మాత్రమే కొన్నాక చూస్తామని చిరంజీవి చెప్పుకొచ్చారు అలా చూస్తున్నారు అంటే అది తమ సినిమాల మీద పెట్టుకున్న నమ్మకం అని అన్నారు. ప్రస్తుతానికి సినిమాలు పూర్తి అయిపోయిన వాటిని రిలీజ్ చేయగలమా ? లేదా ?అనే విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నామని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుని తమకు వెసులుబాటు కల్పించాలని చిరంజీవి కోరారు.

  English summary
  Chiranjeevi requests ys jagan about tickets issue to solve soon at love story pre release function.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X