CM KCR Birthday: తెలంగాణ సీఎం కోసం మెగాస్టార్ చిరంజీవి గొప్ప నిర్ణయం
హరిత తెలంగాణకు కంకణం కట్టుకొన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినోత్సం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ఎమ్మెల్యే రోజా విషెస్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వీడియోను రిలీజ్ చేసి జన్మదిన సందేశాన్ని సీఎం కేసీఆర్‌కు అందించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో ఉండాలన్నదే మన తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఓ అరుదైన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం కేసీఆర్ బర్త్ డే రోజున ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగస్వామై మొక్కలు నాటుదాం. మన ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం. వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం అని పిలుపునిచ్చారు.

ఇక అదే విధంగా సీఎం కేసీఆర్‌కు ఏపీ ఎమ్మెల్యే రోజా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కోటి వృక్షార్చనలో పాల్గొందాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హారిత కానుకగా ఇద్దాం అని ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. ఇప్పటికే కోటి వృక్షార్చన కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











