twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi : అల్లు రామలింగయ్య నా కడుపు మంట తగ్గించారు.. అప్పుడే నన్ను వలలో వేసుకున్నారనిపిస్తుంది!

    |

    నటుడిగా నేను జన్మించినది రాజమండ్రిలోనే అని, రాజమండ్రితో తనకు విడదీయరాని బంధం ఉంది అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. తన మామ, ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా శుక్రవారం నాడు రాజమండ్రి వై-జంక్షన్ లోని అల్లు రామలింగయ్య హోమియో పతి కళాశాల, వైద్య శాల వ్యవస్థాపకుడు అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి, అల్లు అరవింద్ లు ఆవిష్కరించారు. ఈ క్రమంలో చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    నేను జన్మించినది రాజమండ్రిలోనే

    నేను జన్మించినది రాజమండ్రిలోనే

    అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాజమండ్రి వై-జంక్షన్ లోని అల్లు రామలింగయ్య హోమియో పతి కళాశాల ఆవరణలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో 2 కోట్ల రాజ్యసభ నిధులతో నిర్మాణం చేసిన కళాశాల నూతన భవనాన్ని చిరంజీవి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనేనని అన్నారు. నా మొదటి మూడు సినిమాలు పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు, మన ఊరి పాండవులు ఈ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగాయన్నారు.

    నొప్పి తీసినట్లు

    నొప్పి తీసినట్లు

    ఇక నాది అల్లు రామలింగయ్యది గురు - - శిష్యుల సంబంధం వంటిదన్న చిరు బిజీగా ఘాటింగ్ లో ఉండడం వలన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేదని, ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదని అన్నారు. అయితే అలాంటి సమయంలో అల్లు రామలింగయ్య ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి తీసినట్లు పోయిందని గుర్తు చేసుకున్నారు. ఇవాల్టి రోజున కూడా మా ఫ్యామిలీ హూమియోపతి మందులే వాడతామని, హెూమియోపతిలో తగ్గని జబ్బు లేదని ఆయన అన్నారు.

    మరింత ప్రాచుర్యం రావాలి

    మరింత ప్రాచుర్యం రావాలి

    రాజ్యసభ ఎం.పి.గా ఉండటం వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగానని, అన్నారు. సంజీవని లాంటి హోమియోపతి వైద్యమని కొనియాడారు. హోమియోపతి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యమని, హోమియోపతి వైద్యానికి మరింత ప్రాచుర్యం రావాలని చిరంజీవి ఈ సంధర్భంగా ఆకాంక్షించారు. అల్లు రామలింగయ్య స్ఫూర్తి ప్రదాత అని తన చిన్న తనం లో హోమియో పతి ని ఉమాపతిగా పలికేవాడిని అని చిన్న నాటి సంఘటన లు గుర్తు చేసుకున్నారు.

    కడుపులో మంట

    కడుపులో మంట

    మన ఊరి పాండవులు చిత్రం ఘాటింగ్ సందర్భంగా తిరిగి రైల్లో వెళ్తున్న సమయంలో నాకు అల్లు రామలింగయ్యతో పరిచయం ఏర్పడిందని అన్నారు. అప్పుడే నన్ను అల్లుడుగా వలలో వేసుకున్నారనిపిస్తుందని అన్నారు. వానాకాలం చదువులు చదివిన రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని చిరంజీవి కొనియాడారు. ఆయన అనుకుంటే ఏదైనా, సాధించేవారని వివరించారు.

    ఏ రోగానికి అయినా మందు

    ఏ రోగానికి అయినా మందు

    నిత్య విద్యార్ధిగా అల్లు రామలింగయ్య వుండేవారని హోమియో పతి వైద్యం అల్లుగారితోనే కాదు మా అమ్మగారితోనే నాకు అలవాటు ఉందన్నారు. గ్యాంగ్రీన్ వ్యాధులను కూడా రామలింగయ్య నయం చేసేవారని అన్నారు. హోమియోపతి వైద్యంలో ఏ రోగానికి అయినా మందు ఉంటుందని తెలిపారు. ఇక కాలేజీ భవనానికి నిధులు కేటాయించినది నా డబ్బులు కాదు అన్న చిరంజీవి నా రాజ్యసభ నిధుల నుంచి కాలేజీకి 2 కోట్లు ఇచ్చానంతే వివరించారు.ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, అల్లు అరవింద్ పాల్గొన్నారు.

    English summary
    Chiranjeevi unveils Allu Ramalingaiah statue at Rajahmundry homeopathy college.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X