twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్: త్వరగా కోలుకోవాలంటూ చిరంజీవి ట్వీట్

    |

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. సెకెండ్ వేవ్‌లో రోజుకు వేల సంఖ్యలో ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. తెలంగాణలోనైతే దీని విజృంభన మరింత ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ చాలా మంది ప్రముఖులు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా మినిస్టర్ కే తారక రామారావుకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో దీనిపై స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

    తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన.. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వాళ్లందరూ టెస్టులు చేయించుకోమని సలహా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ.. ప్రతి ముఖ్యమైన అంశంపై స్పందిస్తూ ఉండే మెగాస్టార్ చిరంజీవి.. కరోనా బారిన పడిన కేటీఆర్ గురించి ప్రత్యేకమైన ట్వీట్ చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'డియర్ కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. పూర్తి ఆరోగ్యంతో త్వరగా తిరిగి వచ్చేయండి' అంటూ పోస్టు పెట్టారు.

    Chiranjeevi Wishes to KTR for speedy recovery

    ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు, స్టార్ హీరో పవన్ కల్యాణ్ కూడా ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అంతేకాదు, గురువారమే ఆయన అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాడు. వాళ్లిద్దరూ దీనికి చికిత్సను తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. కొరటాల శివ రూపొందిస్తోన్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది.

    English summary
    Chiranjeevi is an Indian film actor and former politician. He served as the Minister of State with independent charge for the Ministry of Tourism, Government of India from 27 October 2012 to 15 May 2014. Known for his breakdancing skills, Chiranjeevi starred in over 150 feature films, primarily in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X