twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tollywood Celebrities donations list: కరోనాపై పోరాటానికి పవన్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్, NTR

    |

    కరోనా వైరస్ కారణంగా ప్రపంచమొత్తం వణికిపోతోంది. భారతదేశంలోనూ ఈ వైరస్ వ్యాప్తి చెంది గడగడలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు 700 మందికి కరోనా సోకింది. నానాటికి కరోనా వైరస్ విస్తిరిస్తూ ఉండటంతో కట్టడి చేసే క్రమంలో దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రభుత్వాలకు అండగా నిలబడేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు.

    Recommended Video

    Tollywood Star Heroes Huge Donation To Government | Prabhas | Pawan Kalyan | Ram Charan|Mahesh Babu
    చిన్నబాబు 20 లక్షల విరాళం

    చిన్నబాబు 20 లక్షల విరాళం


    కరోనా నివారణ చర్యలకు రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని' అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు

    అల్లు అర్జున్ భారీ విరాళం

    అల్లు అర్జున్ భారీ విరాళం

    కరోనావైరస్ ముప్పు నివారించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో అల్లు అర్జున్ భాగంగా నిలిచారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బాధితులను ఆదుకోవడానికి రూ.1.25 కోట్ల విరాళం ప్రకటించారు. అలాగే ఇలాంటి సమయంలో ఇంటి వద్దనే ఉండి స్వీయ గృహ నిర్భంధం పాటించాలి అని అల్లు అర్జున్ ప్రజలను కోరారు.

    కరోనాపై పోరాటానికి సుధీర్‌బాబు విరాళం

    కరోనాపై పోరాటానికి సుధీర్‌బాబు విరాళం

    కరోనా పై పోరాటానికి ప్ర‌ముఖ హీరో సుధీర్ బాబు కూడా ముందుకొచ్చారు. 2 ల‌క్ష‌ల రూపాయ‌లు విర‌ళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో ల‌క్ష రూపాయ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హా నిధికి మ‌రో లక్ష రూపాయ‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కి అందించ‌నున్నారు. దేశ ప్ర‌ధాని పిలుపు మేరకు 21 రోజులు లాక్ డౌన్ కి త‌న సంపుర్ణ మ‌ద్ధ‌త్తు తెలిపిన సుధీర్ బాబు, ఇంటి ద‌గ్గ‌ర ఉంటూనే ఫిట‌నెస్ ని మెయింటైన్ చేయాలో వీడియోలు చేసి విడుద‌ల చేశారు.

    అశ్వినీదత్ 20 లక్షల విరాళం

    అశ్వినీదత్ 20 లక్షల విరాళం

    కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధం కోసం ప్ర‌ముఖ నిర్మాత, వైజ‌యంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీద‌త్ రూ. 20 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 10 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన అశ్వినీద‌త్‌.. ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని కోరారు.

    దర్శకుడు సుకుమార్ 10 ల‌క్ష‌ల విరాళం

    దర్శకుడు సుకుమార్ 10 ల‌క్ష‌ల విరాళం

    క‌రోనా వైర‌స్‌ (కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5 ల‌క్ష‌లు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందజేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు.

    మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 5 లక్షల విరాళం

    మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 5 లక్షల విరాళం

    ప్రస్తుతం కరోనాతో నెలకొన్న పరిస్థితులను చక్క దిద్దడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర, రాష్ర ప్రభుత్వాల చర్యలను మ్యూజిక్ డైరెక్టర్ స్వాగతించారు. ఈ క్రమంలో హైదరాబాద్, చెన్నైలో పనిచేసే సినీ సంగీతకారుల యూనియన్‌కు రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బందికి లోనయ్యే రోజువారీ వేతన కళాకారులను ఆదుకొనేందుకు ఉపయోగించుకోనే విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

    ప్రభుత్వాలకు అండగా..

    ప్రభుత్వాలకు అండగా..

    కరోనా కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు, ప్రజల అవసరాలను తీర్చేందుకు గానూ ప్రభుత్వాలకు ఆర్థికంగా సాయపడేందుకు టాలీవుడ్ సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే నితిన్, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, కొరటాల శివ, రామ్ చరణ్, అనిల్ రావిపూడి వంటి వారు ముందుకు వచ్చారు.

    పవన్ భారీ విరాళం..

    పవన్ భారీ విరాళం..

    పవన్ కళ్యాణ్ తన మానవత్వాన్ని చాటుకున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయల విరాళాన్ని, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి మరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించాడు. రామ్ చరణ్ 70లక్షలు ప్రభుత్వానికి సాయంగా అందించాడు.

    తాజాగా ప్రభాస్..

    తాజాగా ప్రభాస్..

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మంచి పనిలో భాగస్వామి అయ్యాడు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కలిసి కోటి రూపాయాల భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేశాడు.

    సాయి ధరమ్ తేజ్ కూడా..

    సాయి ధరమ్ తేజ్ కూడా..

    ‘మనమంతా ఓ భయంకరమైన శత్రువుతో పోరాడుతున్నాం. మనందరం దీన్ని జయించి బయట పడాలి.. దీనికోసం నా వంతుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు పది లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నా'నని ట్వీట్ చేశాడు.

    సినీ కార్మికులకు అండగా ఎన్టీఆర్..

    సినీ కార్మికులకు అండగా ఎన్టీఆర్..

    భయంకరమైన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుక ప్రభుత్వాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు సినీ తారలు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 75లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇందులో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 లక్షలను, సినీ శ్రామికులకు సహాయార్థం రూ. 25 లక్షలను ప్రకటించాడు.

    హృతిక్ రోషన్ 20 లక్షలు సహాయం

    హృతిక్ రోషన్ 20 లక్షలు సహాయం

    కరోనా పరిస్థితి కారణంగా రేయింబవళ్లు శ్రమిస్తున్న ముంబై మున్సిపల్ (బీఎంసీ) కార్మికులకు హృతిక్ ఆర్థిక సహాయం అందించారు. బీఎంసీ వర్కర్లు, ఇతర సహాయ బృందాల కోసం హృతిక్ రోషన్ సుమారు రూ.20 లక్షల విరాళం ప్రకటించారు అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా హృతిక్ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి కష్టకాలంలో మన కోసం, సొసైటీ కోసం ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ప్రతీ ఒక్కరికి మనం అండగా నిలువాలి. బీఎంసీ సిబ్బంది కోసం n95, FFP3 మాస్కులను అందిస్తున్నాను అని హృతిక్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

     సినీ వర్కర్స్ కోసం యువహీరోలు నాగ చైతన్య, కార్తికేయ విరాళం

    సినీ వర్కర్స్ కోసం యువహీరోలు నాగ చైతన్య, కార్తికేయ విరాళం

    పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సిసిసి (కరోనా క్రైసిస్ ఛారిటీ) అనే నిధికి లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. "చిత్ర పరిశ్రమలో భాగంగా, చలనచిత్ర సోదరభావం ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి) ద్వారా రోజువారీ వేతనాలపై పనిచేసే ప్రజలకు నా మద్దతును అందించాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి 1 లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేస్తున్నాను" అని ఆమె చెప్పారు.

    English summary
    Corona Effect Prabhas Donations To CM Relief fund. In The corona Crisis To Supports Governments Prabhas Donated One Crore To Two States CM Relief Funds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X