twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ తెర మీదకు టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. న్యాయస్థానంలో కీలక పరిణామం!

    |

    టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. తెలుగులో పేరు మోసిన సినీ నటులను, దర్శకు నిర్మాతల చుట్టూ ఈ డ్రగ్స్ కేసు వ్యవహారం కొన్నాళ్ల పాటు నడిచింది. అయితే ఈ కేసు ఇక మరుగున పడిపోయింది అనుకుంటున్న తరుణంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    టాలీవుడ్ లో డ్రగ్స్ దందా

    టాలీవుడ్ లో డ్రగ్స్ దందా

    2017 ఈ సంవత్సరంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెరమీదకు వచ్చింది. అంతకుముందే నటుడు రవితేజ సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో ఆయన డ్రగ్స్ తీసుకొని ఉన్నట్లు పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో డ్రగ్స్ దందా నడుస్తోందని భావించి పెద్ద ఎత్తున ఎక్సైజ్ శాఖ దృష్టిసారించింది.

    ఏకంగా 60 మంది మీద

    ఏకంగా 60 మంది మీద

    ఈ నేపధ్యంలోనే అనేక విచారణల అనంతరం 2017 జూలై 2న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం అప్పట్లో 12 మంది సినీ రంగానికి చెందిన వారి మీద అప్పట్లో డ్రగ్స్ కేసు నమోదయింది. 12 కేసులు నమోదు కాగా ఈ కేసులకు సంబంధించి 60 మందికి పైగా విచారణ కూడా జరిపారు.

    వీరిలో 30 మందిని అరెస్టు చేసి 27 మందిని విచారణ కూడా జరిపినట్లు అప్పట్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చార్జిషీట్ లో కూడా పేర్కొన్నారు.

    విమర్శలు రావడంతో

    విమర్శలు రావడంతో

    అయితే ముందుగా 12 కేసుల్లో ఎనిమిది కేసులలో మాత్రమే అధికారులు చార్జిషీట్ ఫైల్ చేయడంతో అప్పట్లో చాలా ఆరోపణలు వినిపించాయి. అనేక విమర్శల నేపథ్యంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మిగిలిన నాలుగు కేసులు కూడా చార్జిషీట్ దాఖలు చేసింది.. ఈ చార్జిషీట్ దాఖలు చేసేందుకు గాను 11 మంది సినీ ప్రముఖులతో పాటు హీరో రవితేజ డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తిని కూడా అప్పట్లో పోలీసులు విచారించారు.

    11 మంది సినీ నటులు

    11 మంది సినీ నటులు

    11 మంది సినీ నటులు దగ్గర శాంపిల్స్ కూడా తీసుకుని వారి నమూనాలను టెస్ట్ కు పంపించారు. వాటిలో ఎక్కడా డ్రగ్స్ కు సంబంధించిన ఆనవాళ్లు లేకపోవడంతో వారికి క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్.. అయితే సినీ ప్రముఖులను కావాలనే తప్పించాలని చెబుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ చాలా రోజుల నుంచి పోరాడుతోంది.

    ఏమే దొరక్కపోవడంతో క్లీన్ చిట్

    ఏమే దొరక్కపోవడంతో క్లీన్ చిట్

    అందులో భాగంగానే ఇప్పుడు చార్జ్ షీట్ దాఖలు చేసిన నాలుగేళ్ల తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఛార్జ్ షీట్ ఆమోదం తెలిపింది. ఇక అప్పట్లో రవితేజ, పూరి జగన్నాథ్, సుబ్బరాజు, తనీష్, ముమైత్ ఖాన్ వంటి అనేక మంది నటీనటులును ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసులు విచారణ జరిపి వారి నుంచి నమూనాలు కూడా సేకరించారు. అయితే వాటిలో డ్రగ్స్ ఆనవాళ్ళు లేకపోవడంతో క్లీన్ చిట్ ఇవ్వాల్సి వచ్చింది.

    English summary
    The drugs case of Tollywood celebrities to the court after a detailed investigation and the court approved the report recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X