twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA అధ్య‌క్ష బ‌రిలో మ‌రో న‌టుడు.. ఊహించని విధంగా తెలంగాణ వాదంతో తెర మీదకు!

    |

    తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను కల్పిస్తున్నాయి.. ఇప్పటికే పలువురు రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించగా మరికొందరు రంగంలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో నటుడు తాను మా అధ్యక్ష బరిలో దిగుతున్నానని ప్రకటించి కలకలం రేపారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    ఇప్పటికే నలుగురు

    ఇప్పటికే నలుగురు

    తెలుగు సినిమా నటీనటులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఒక పక్క ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ తాము పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా జీవిత రాజశేఖర్ కూడా పోటీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది, ఆమె ఇంకా మీడియా ముందుకు వచ్చి ప్రకటించలేదు.

    రచ్చ మొదలు

    రచ్చ మొదలు

    ఇప్పటికే మా ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజు ఒక ప్రెస్ మీట్, నరేష్ ఒక ప్రెస్ మీట్ పెట్టి పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయగా ఇప్పుడు తాను బరిలోకి దిగుతున్న అంటూ సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. వృత్తిరీత్యా లాయర్ అయిన సీవీఎల్ వెంకటేశ్వరరావు అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

     స్వతంత్రంగా

    స్వతంత్రంగా

    అయితే తనకు ఎలాంటి ప్యానెల్ లేదని పేర్కొన్న నరసింహారావు స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న వివాదాల కారణంగా తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్న ఆయన మరీ ముఖ్యంగా తెలంగాణ-ఆంధ్ర అనే అంశాన్ని ఆయన ఎత్తారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

    తెర మీదకు తెలంగాణ వాదం

    తెర మీదకు తెలంగాణ వాదం

    తెలంగాణ వాదంతో తాను ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన అసోసియేషన్ ని విభజించాలని డిమాండ్ చేశారు. 18 మంది కార్యవర్గ సభ్యులు ఉంటే అందులో తొమ్మిది మంది తెలంగాణ కళాకారులు తొమ్మిది మంది ఆంధ్ర కళాకారులకు సమంగా అవకాశం కల్పించాలని కోరారు.. తెలంగాణ వాదంతో ముందుకు రావడంతో ఇప్పుడు ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    మొత్తం ఐదుగురు

    మొత్తం ఐదుగురు

    ఇక సీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటన కారణంగా ఇప్పటి వరకు మొత్తం ఐదుగురు అభ్యర్థులు మా అధ్యక్ష బరిలో దిగుతున్నట్లు ప్రకటించినట్లు అయింది. అయితే ఇద్దరు పోటీ చేస్తేనే రచ్చగా ఉండే మా ఎన్నికలు ఇప్పుడు ఏకంగా ఐదుగురు బరిలోకి దిగితూ ఉండడం, అందులో దాదాపుగా ముగ్గురు దాకా బలమైన క్యాండిడేట్లు ఉండడంతో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

    English summary
    character artiste CVL Narasimha Rao on Sunday announced that he would contest MAA (Movie Artistes Association) 2021 elections Pitching forth the Telangana sentiment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X