Don't Miss!
- News
హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
సాయి ధరమ్ తేజ్ కు పోలీసుల షాక్.. అలా చేయమంటే చేయలేదని కీలక నిర్ణయం.. ఏమవనుందో?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన బండి స్పీడ్ గా వెళ్లిందని ఒకసారి లేదు రోడ్డు మీద ఉన్న ఇసుక కారణంగా పడిపోయాడని ఒక సారి ఇలా పోలీసులు భిన్న ప్రకటనలు చేశారు. ఆ సంగతి అలా ఉంచితే ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది.

లక్ష రూపాయల జరిమానా
సాయి ధరమ్ తేజ్ ప్రమాదం జరిగిన సమయంలో సాయిధరమ్ తేజ్ మీద ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రోడ్డు మీద ఇసుక ఉండడానికి గల కారణమైన కంపెనీకి కూడా లక్ష రూపాయల జరిమానా విధించారు. కేబుల్ బ్రిడ్జి దాటాక ఉన్న కోహినూర్ హోటల్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరగా జరిగిన వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత అక్కడ ప్రథమ చికిత్స అందుకున్న తరువాత ఆయనను చిరంజీవి కుటుంబ సభ్యులకు చెందిన అపోలో హాస్పిటల్ కి తరలించారు.

ప్రమాదం సమయంలో
అపోలో చేరినప్పటి నుంచి ఆయనకు ఇంటెన్సివ్ కేర్ అందిస్తూ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ముందుగా ఆయన కాలర్ బోన్ డిస్ లొకేట్ అయిన కారణంగా కాలర్ బోన్ కి సంబంధించిన సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఆయనకు వెంటిలేటర్ సపోర్టు ఊపిరి అందిస్తూ వచ్చారు. అలా ఎట్టకేలకు ఆయన కోలుకున్నరుద్ కూడా.
అయితే ప్రమాదం సమయంలో సైబరాబాద్ పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 91 కింద కేసు కూడా నమోదు చేశారు. తన లైసెన్స్, బైక్ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కాపీ మరియు పొల్యూషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలని తేజ్‌కి నోటీసులు పంపామని, అయితే హీరో అలా చేయడంలో విఫలమయ్యాడని కొత్తగా నియమితులైన స్టీఫెన్ కుమార్ ప్రెస్ కు వెల్లడించారు.

91 CRPC కింద
సోమవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో పాల్గొన్న కమిషనర్ స్టీఫెన్ రవింద్ర బైక్ యాక్సిడెంట్ విషయమై పలు కీలక విషయాలు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయమై కేసు నమోదు చేశామని తెలిపిన కమిషనర్ స్టీఫెన్ రవింద్ర తేజ్ కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు.

నోటీసుల్లో భాగంగా
నోటీసుల్లో భాగంగా లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఆర్సీ, ఇన్సురెన్స్ వంటి డ్యాక్యుమెంట్లను సబ్‌మిట్ చేయాలని కోరామన్నారు. అయితే సాయ్ ధరమ్ తేజ్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలిపారు. తేజ్ నుంచి స్పందన రాని కారణంగా అతనిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.
Recommended Video

రిపబ్లిక్ సినిమాతో
ఇక సాయి ధరం తేజ్ సినిమాల విషయానికి వస్తే ఆయన చివరిగా రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక రిస్క్ తీసుకోకుండా సాయి ధరమ్ డాక్టర్ సూచనల ప్రకారం ఇంట్లో ఉంటున్నారు అని చెబుతున్నారు. అయితే సాయి ధరమ్ త్వరగా కమ్ బ్యాక్ ఇవ్వాలని, మునుపటిలా షూటింగ్ లో పాల్గొనాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.