twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి ఆశయాలకు కొనసాగిస్తాం.. ఔత్సాహికుల కోసం షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్

    |

    స్వర్గీయ దాసరి ఆశయాలకు కొనసాగింపుగా ఏర్పాటైన 'దాసరి టాలెంట్ అకాడమీ' 2019 సంవత్సరానికి గాను షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌ను ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యూరీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ, దాసరి టాలెంట్ అకాడెమీ వ్యవస్థాపకులు బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, జ్యూరీ మెంబర్స్ ప్రముఖ దర్శకులు ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెం రెడ్డి, సీనియర్ రైటర్ రాజేంద్రకుమార్ పైడిపాటి, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఎస్.మల్లిఖార్జునరావు (పద్మాలయ మల్లయ్య) పాల్గొన్నారు.

    మానవ సంబంధాలు, మానవీయ విలువల నేపథ్యంలో 15 నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాలని ఔత్సాహిక షార్ట్ ఫిలిం దర్శక, నిర్మాతలకు సూచించారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారికి ప్రథమ బహుమతిగా లక్ష రూపాయలు, రెండో బహుమతిగా రూ. 50 వేలు, మూడవ బహుమతిగా రూ.25 వేలను పారితోషికంగా అందజేస్తామని తమ్మారెడ్డి చెప్పారు.

    Dasari Talent Academy to organise Short film contest

    అంతేకాకుండా మొదటి జ్యూరీ అవార్డు రూ.25 వేలు, రెండవ జ్యూరీ రూ.15.000/-, ఉత్తమ దర్శకుడు రూ.20.000/-, ఉత్తమ కథా రచయిత రూ.10.000/-, ఉత్తమ నటుడు రూ.10,000/-, ఉత్తమ నటి రూ.10.000/- చొప్పున నగదు బహుమతులను 'నీహార్ ఈ సెంటర్' సౌజన్యంతో అందజేస్తామని బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ తెలిపారు. మార్చి 30 వరకు షార్ట్ ఫిల్మ్స్ స్వీకరిస్తామని, మే 5న బహుమతి ప్రధాన సభ నిర్వహిస్తామని ప్రకటించారు.

    దాసరికి అత్యంత సన్నిహితులైన సూర్యనారాయణ చేపట్టిన ఈ పోటీకి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రాజా వన్నెం రెడ్డి, రాజేంద్రకుమార్, పద్మాలయ మల్లయ్య పేర్కొన్నారు. ఈ పోటీకి నగదు బహుమతులు అందించేందుకు ముందుకొచ్చిన 'నీహార్ ఈసెంటర్' వారిని వారు అభినందించారు. మరిన్ని వివరాలకు Dasaritalentacademy.org వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలని సూచించారు.

    English summary
    Dasari Talent Academy to organise Short film contest in tollywood. Nihar E Cent is supporting this event. Tammareddy Bhardwaj and some other Film personalities attended this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X