‘డియర్ కామ్రెడ్’ టీజర్‌కు రికార్డ్ స్థాయి వ్యూస్.. ట్రెడింగ్ నెం.1
హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై... భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "డియర్ కామ్రేడ్". రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. "ఫైట్ ఫర్ వాట్ యు లవ్" అనేది ఉపశీర్షిక.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మే 31న గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మార్చి 17న టీజర్ విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. యాక్షన్, రొమాన్స్ కలగలిపి ఈ టీజర్ విడుదల చేశారు.
24 గంటల్లో ఈ టీజర్ 5.5 మిలియన్ వ్యూస్‌తో పాటు 2 లక్షలకుపైగా లైక్స్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో సౌతిండియాలో ట్రెడింగ్ నెం.1గా నిలిచింది. విజయ్ దేవరకొండ, రష్మికలపై చిత్రీకరించిన ముద్దుసీన్ టీజర్లో మరింత హైలెట్ అవ్వడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. 'అర్జున్ రెడ్డి' స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.

విజయ్, రష్మిక నటించిన గత చిత్రం 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్లో వస్తున్న రెండు సినిమా కావడంతో ప్రేక్షకుల్లో 'డియర్ కామ్రేడ్'పై ఆసక్తి పెరిగింది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కమ్మ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని, సి.ఇ.ఒ: చెర్రీ, సంగీతం: జస్టిన్ ఫ్రభాకరన్, డైలాగ్స్: జె కృష్ణ, ఆర్ట్: రామాంజనేయులు, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.వి.ఎస్.సుబ్రమణ్యం, సాహిత్యం: చైతన్య ప్రసాద్, రహమాన్, కృష్ణకాంత్, కొరియోగ్రఫీ: దినేష్ మాస్టర్, యాక్షన్ డైరెక్టర్: జి.మురళి, పబ్లిసిటీ డిజైనర్స్: అనీల్, భాను.


Click it and Unblock the Notifications











