For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Devi Sri Prasad ఇంట వరుస విషాదాలు.. తమ్ముడి మరణంతో అక్కకి హార్ట్ ఎటాక్!

  |

  టాలీవుడ్ లో వరుస విషాద సంఘటనలు సంచలనంగా మారుతున్నాయి. సాయి ధరంతేజ్ ఇప్పటికే రోడ్డు ప్రమాదానికి గురైన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండగా ఆయన ఆరోగ్యం మెరుగు పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ దీనికి సంబంధించి ఆయన ఎప్పుడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు అని ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది అంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆయన ఆత్మీయులను కోల్పోయారని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

  20వ ఏటనే

  20వ ఏటనే

  దేవి శ్రీ ప్రసాద్ రైటర్ సత్యమూర్తి తనయుడు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక స్కూల్ దశ నుంచి మ్యూజిక్ ను నరనరాల్లో నింపుకున్న డీఎస్పీ మొదటి అవకాశాన్ని కూడా చాలా విచిత్రంగా అందుకున్నాడు. ఇంకా 20 ఏళ్ళ వయసు కూడా రాకుండానే కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవి సినిమాకు సాంగ్స్ కంపోజ్ చేయడమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

  స్టార్ డైరెక్టర్

  స్టార్ డైరెక్టర్

  దేవి సినిమా హిట్టవడంతో అదే తన పేరుగా మార్చుకున్న ఆయన రెండు మూడేళ్లలో ఇండస్ట్రీలో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అప్పటి నుంచి దేవి తెలుగు తమిళ్ అని తేడా లేకుండా సౌత్ లో అన్ని రకాల సినిమాలు చేశాడు. ఆనందం, ఖడ్గం, వర్షం, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, జల్సా, అదుర్స్, 100% లవ్, గబ్బర్ సింగ్, మిర్చి, అత్తారింటికి దారేది, ఖైదీ నెంబర్ 150, డీజే, రంగస్థలం, ఉప్పెన అంటూ.. మర్చిపోలేని ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించారు.

  సెంచరీ కొట్టి

  సెంచరీ కొట్టి

  ఇక ఇటీవల సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. దేవిశ్రీప్రసాద్ 100వ సినిమా ఖిలాడిగా నిలవనుంది. అలాగే ఇటీవల ఉప్పెన సినిమాతో లైన్ లోకి వచ్చిన దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. అలాగే చిరంజీవి- బాబీ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మిస్తున్న ఈ సినిమాకు కూడా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

  వరుస విషాదాలు

  వరుస విషాదాలు

  తాజాగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఇంట వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న దేవిశ్రీప్రసాద్ బాబాయ్ గొర్తి బుల్లి బుల్గేనిన్ మృతి చెందారు. తమ్ముడు మరణవార్త విని షాకైన ఆయన అక్క అంటే దేవిశ్రీప్రసాద్ మేనత్త కొమ్ముల సీతామహాలక్ష్మి హార్ట్ ఎటాక్ తో మరణించడం దేవి శ్రీ ప్రసాద్ సన్నిహితుల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

  ఆరుగురు సంతానం

  ఆరుగురు సంతానం

  తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక దేవీశ్రీ ప్రసాద్ తండ్రి స్వగ్రామం. ఆయన తండ్రి సినీ రచయిత సత్యమూర్తి తండ్రి తండ్రి నారాయణ కమ్యూనిస్ట్. ఆయనకి ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు కాగా పెద్ద కూతురు సీతామహలక్ష్మి, తర్వాత కొడుకులు హరినారాయణ, సత్యమూర్తి, బుల్జ్యోగానిన్, జ్యోతి, గౌరీపార్వతి అలా మొత్తం ఆరుగురు సంతానం ఉన్నారు.

  తమ్ముడి మరణంతో అక్క

  తమ్ముడి మరణంతో అక్క

  రష్యన్ కమ్యూనిస్టు లీడర్ బుల్గేనిన్ చనిపోయిన రోజు పుట్టడంతో.. నారాయణ తన చిన్న కొడుకుకు ఆ పేరు పెట్టారు. అయితే పిల్లలు అందరూ ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండేవారు. అయితే యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న దేవిశ్రీప్రసాద్ బాబాయ్ గొర్తి బుల్లి బుల్గేనిన్ మృతి చెందారు. తమ్ముడు మరణవార్త విని షాకైన ఆయన అక్క అంటే దేవిశ్రీప్రసాద్ మేనత్త కొమ్ముల సీతామహాలక్ష్మి హార్ట్ ఎటాక్ తో మరణించారు.

  Recommended Video

  Bigg Boss Telugu 5 : మగాడివి అయితే రా VJ Sunny VS Priya నైట్ అయితే దెయ్యం || Filmibeat Telugu
  అందుకే తీవ్ర విషాదం

  అందుకే తీవ్ర విషాదం

  నిజానికి సీతామహలక్ష్మి ప్రోత్సాహంతోనే సత్యమూర్తి సినీరంగంలో ఎంటర్ అయ్యారని అంటూ ఉంటారు. అందుకే దేవిశ్రీప్రసాద్ ఫ్యామిలీకి సీతామాలక్ష్మి కుటుంబంతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక బాబాయ్, మేనత్తలు ఒకేసారి ఆకస్మికంగా మృతి చెందడంతో దేవిశ్రీప్రసాద్ సహా ఆయన కుటుంబ సభ్యులు అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. బుల్గేనిన్ కొడుకు విజయ్ బుల్గేనిన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు.

  English summary
  as per sources devi sri prasad uncle bulganin met an accident and after that he passed away hearing this devi sri prasad aunt seethamahalakshmi passed away.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X