‘పెళ్లయిన 2 నెలలకే అలా చీటింగ్.. ఛాహల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా’

సెలబ్రిటీల జీవితాలలో పెళ్లి, ఎఫైర్లు, ప్రేమలు, విడాకులు అన్నది కామన్‌గా మారిపోయింది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో మంది ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. ఎప్పుడు ఏ సెలబ్రిటీ బాంబు పేలుస్తాడో అర్ధం కాక వారి అభిమానులు షాక్‌లో ఉండిపోయారు. ఈ ఏడాది ఎక్కువ కాంటవర్సీ అయినది, మీడియాలో ఎక్కువగా వినిపించిన సెలబ్రిటీ విడాకులు కేసు టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ జంటదే. నెలలు గడుస్తున్నప్పటికీ ఈ వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది.

డ్యాన్స్ కలిపిన బంధం
యూట్యూబర్ , కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ధనశ్రీ వర్మ మీడియాలో, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యింది. ఈ పాపులారిటీతోనే హిందీ రియాలిటీ షోలోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు ధనశ్రీ వర్మ. ఓ ఈవెంట్‌లో టీమిండియా క్రికెటర్లతో కలిసి యాన్స్ చేసే అదృష్టం ఈ ముద్దుగుమ్మకి దక్కింది. ఈ క్రమంలోనే ధనశ్రీకి చాహల్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ చేయడం ప్రారంభించారు. ఈ విషయం బాలీవుడ్ సర్కిల్స్‌‌లోనూ, క్రికెట్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ దశలో తమ ప్రేమ విషయాన్ని వీరిద్దరూ బయటపెట్టారు. పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న గురుగ్రామ్‌లోని ఓ రిసార్ట్‌లో చాహల్- ధనశ్రీల వివాహం గ్రాండ్‌గా జరిగింది. నాలుగేళ్ల పాటు చాహల్ - ధనశ్రీ వర్మల వైవాహిక జీవితం సాఫీగా సాగింది. ఇద్దరూ వెకేషన్స్‌, పార్టీలలో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కాపురం చేశారు.

Dhanashree Verma reveals how Yuzvendra Chahal cheated with in 2 months of marriage

నాలుగేళ్లకే విడాకులు
కానీ అనూహ్యంగా ఈ జంట మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో చాహల్- ధనశ్రీలు విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో తొలుత ఊహాగానాలు వినిపించాయి. తొలుత వీటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ కొద్దిరోజులకు ఈ సెలబ్రిటీ కపుల్ మౌనం వీడారు. చాహల్ - ధనశ్రీలు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత భరణం కింద ధనశ్రీ వర్మ రూ.60 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలు రావడంతో భారతీయ సినీ, క్రీడా రంగాలు ఉలిక్కిపడ్డాయి. అయితే భార్యకు రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ సెటిల్‌మెంట్ చేసుకున్నట్లుగా బీటౌన్ టాక్. అనంతరం మార్చి 20న చాహల్ - ధనశ్రీలకు విడాకులు మంజూరు చేస్తూ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టు తీర్పు వెలువరించింది.

ఇతరులను తక్కువ చేయొద్దు
అయితే ఇప్పటికీ చాహల్ - ధనశ్రీల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్కే. తాజాగా హిందీ రియాలిటీ షో రైజ్ అండ్ ఫాల్‌లో పాల్గొన్న ధనశ్రీ వర్మకు చాహల్‌తో ప్రేమ, పెళ్లి, విడాకులు, భరణం విషయంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో చాహల్‌పై ధనశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డివోర్స్ తర్వాత చాహల్ పట్ల అగౌరవంగా ప్రవర్తించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. మన ఇమేజ్, పబ్లిసిటీ కోసం ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదని, తనపై ఎంత దుష్ప్రచారం చేసినా, ఎంత బ్యాడ్‌గా చెప్పినా వాళ్ల సమయమే వృధా అని దుయ్యబట్టారు ధనశ్రీ.

Take a Poll

2 నెలలకే పట్టుకున్నా
ఇక చాహల్‌ని పెళ్లాడటం మీరు చేసిన తప్పని ఎప్పుడు తెలిసిందని ధనశ్రీని నటి కుబ్రా సైత్ ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందవిస్తూ.. పెళ్లయిన రెండు నెలలకే చాహల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని చెప్పడంతో ధనశ్రీ వర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇక విడాకుల సమయంలో చాహల్ నుంచి తాను 60 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా వచ్చిన వార్తలు కూడా పూర్తి నిరాధారమని ధనశ్రీ ఖండించారు. తాను అంత మొత్తం అడగలేదని, అలాగే చాహల్ నుంచి ఆ రకమైన ప్రతిపాదన కూడా రాలేదని ఆమె స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X