For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ధనుష్ తొలి తెలుగు చిత్రం సార్ ప్రారంభం.. త్రివిక్రమ్ చేతుల మీదుగా వెంకీ అట్లూరి మూవీ

  |

  విలక్షణ నటుడు ధనుష్ తొలిసారి నేరుగా నటించే తెలుగు చిత్రం నిరాడంబరంగా, అతి కొద్దిమంది సినీ ప్రముఖలు మధ్య ప్రారంభమైంది. తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ధనుష్ సార్ అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందతున్నది.

  తమిళంలో వాతిగా, తెలుగు సార్ టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభోత్సవం 10 గంటల 19 నిమిషాలకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య వైభవంగా జరిగింది. ఇటీవ‌ల‌ 'రంగ్‌దే' చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

  Dhanush, Samyuktha Menons sir movie formally launched by Trivikram Srinivas

  సార్ చిత్ర హీరో, హీరోయిన్లు ధనుష్, సంయుక్త మీనన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. ప్రముఖ నిర్మాతలు డా: కె.ఎల్.నారాయణ, ఎం.ఎల్. కుమార్ చౌదరి, ప్రగతి ప్రింటర్స్ అధినేత మహేంద్ర చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందచేశారు. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని నిర్మాతలు తెలిపారు.

  మలయాళ యువ హీరోయిన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో హీరో ధనుష్‌ పక్కన కథానాయికగా నటిస్తున్నారు. 'సూదు కవ్వం', 'సేతుపతి', 'తెగిడి', 'మిస్టర్ లోకల్', 'మార' వంటి చిత్రాలకు పనిచేసి త‌న‌దైన ముద్ర‌వేసిన‌ సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హృద‌యాన్ని హ‌త్తుకొనే సంగీతం స‌మ‌కూర్చ‌డంలో దిట్ట అయిన జి.వి. ప్ర‌కాష్‌కుమార్ ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు వెల్లడిచేయనున్నట్లు తెలిపారు నిర్మాతలు.

  Dhanush, Samyuktha Menons sir movie formally launched by Trivikram Srinivas

  తారాగ‌ణం: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌, సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి, నర్రాశ్రీను తదితరులు
  ర‌చ‌న, ద‌ర్శ‌కత్వం: వెంకీ అట్లూరి
  నిర్మాత‌లు: నాగ‌వంశీ ఎస్‌. సాయి సౌజ‌న్య‌
  ఎడిట‌ర్: న‌వీన్ నూలి
  సినిమాటోగ్రాఫ‌ర్: దినేష్ కృష్ణ‌న్‌
  మ్యూజిక్: జి.వి. ప్ర‌కాష్‌కుమార్‌
  స‌మ‌ర్ప‌ణ: పి.డి.వి. ప్ర‌సాద్‌
  బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: అవినాష్ కొల్లా
  పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్

  English summary
  Sithara Entertainments and Fortune Four Cinemas are joining hands to produce 2 time-National Award Winning actor Dhanush's Telugu-Tamil bilingual titled ‘SIR’ (Telugu)’/'Vaathi’ (Tamil). The film, written and directed by Venky Atluri, starring Samyuktha Menon in the lead, was announced recently. The project went on floors formally with a pooja ceremony in Ramanaidu Studio, Hyderabad today at 10.19 am
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X