Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
దాండియాతో ఆకట్టుకున్న టిక్ టాక్ ఆర్టిస్టులు.. ధన్య బాలకృష్ణ జోరుగా
దసరా సందర్భంగా భాగ్యనగరంలో పలుచోట్ల అనేక దాండియా కార్యక్రమాల జోరు కొనసాగింది. పండుగ సీజన్‌లో టిక్ టాక్ నటీనటులు కూడా ఈ సంబరాల్లో ఏమీ తక్కువ కాదు అని నిరూపించుకున్నారు వీరభద్ర క్రియేషన్స్ నిర్వహించిన టిక్ టాక్ దాండియా కార్యక్రమంలో టిక్ టాక్ ఆర్టిస్టులు పెద్ద ఎత్తున పాల్గొని దాండియా ఆడుతూ ఆకట్టుకున్నారు. ప్రముఖ సినీ నటి ధన్య బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు.
సోషల్ మీడియా జోష్ ఉండటంతో సామాన్యులు కూడా ఈ మధ్య కాలంలో టిక్ టాక్ ఆసరగా చేసుకొని ఔత్సాహికులు చాలా బాగా రాణిస్తున్నారు అని ధన్య బాలకృష్ణ పేర్కొన్నారు. దసరా అనగానే నగరమంతా కోలాటాలతో నిండు పోతుంది కానీ ఈ సారి నాకు టిక్ టాక్ నటీనటులతో కలిసి ఆడే అవకాశం లభించినందుకు ఆనందిస్తున్నా అని అన్నారు. టిక్ టాక్ యువతీ యువకులు ఎంతో నైపుణ్యంతో నటిస్తున్నారు అని ఆమె తెలిపారు.

రాబోయే రోజుల్లో టిక్ టాక్‌లో ప్రతిభ చాటుకొంటున్న నటులు అందరికీ సినిమా రంగంలో మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని ధన్య తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకురాలు హేమలత రెడ్డి (బుజ్జియాక్టర్) మాట్లాడుతూ టిక్ టాక్ నటుల అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని తెలిపారు.

ప్రతి ఏడాది టిక్ టాక్ నటీనటులు అందరికీ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బాగా ప్రదర్శన చేసిన నటులు హర్షిత్ రెడ్డి,అవినాష్, కళ్యాణ్ మరియు జిగేల్ రాజా అనే యువకులకు బహుమతులు అందజేసి సత్కరించారు.