దిల్ రాజు ఫ్యామిలీ నుంచి తొలి హీరో ..మొదటి సినిమాకే అనుపమతో.. ఫస్ట్ లుక్‌లో షాకింగ్‌గా!
టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ అనేది చాలా సర్వ సాధారణం అయిపోయింది. అయితే నటీనటులు దర్శక నిర్మాతలు వారసులుగా సినీ రంగంలో ప్రవేశిస్తున్న వారికి టాలెంట్ ఉంటే నిలబడుతున్నారు టాలెంట్ లేకపోతే ఎంత చేయాలని చూసినా లాభం ఉండటం లేదు.. ఇప్పటికే వారసుడిగా ఎంట్రీ ఇచ్చి నిరూపించుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు అలాగే విఫలమై చరిత్రపుటల్లో మిగిలిపోయిన వారు చాలా మంది ఉన్నారు. తాజాగా దిల్ రాజు మేనల్లుడు సినీరంగ ప్రవేశానికి సంబంధించిన మొదటి సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది ఆ వివరాల్లోకి వెళితే
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ ఎంట్రీకి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అనే విషయం దాదాపుగా సంవత్సరం క్రితమే వెల్లడైంది. ఆశిష్ రెడ్డి హీరోగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హుషారు దర్శకుడు శ్రీ హర్ష కానుగంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి కాలేజ్ గ్యాంగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కించారని అంటున్నారు.. అందుకే ఈ సినిమా టైటిల్ కూడా రౌడీ బాయ్స్ అని ఫిక్స్ చేశారని అంటున్నారు.

మరో పక్క ఈ రౌడీ బాయ్స్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అలాగే టాప్ సినిమాటోగ్రాఫర్ మధీ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు, శిరీష్ లు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా సినిమా ఫస్ట్ లుక్ లో దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆసక్తికరంగా కనిపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా కొద్దిసేపటి క్రితం విడుదల కాగా ఈ మోషన్ పోస్టర్ లో ఆశిష్ రెడ్డి షర్టు లేకుండా జిమ్ బాడీ తో కనిపిస్తున్నాడు చేతిలో ఒక బేస్బాల్ బ్యాట్ పట్టుకుని ఆయన భుజం అంతా కూడా టాటూలతో కనిపిస్తోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. ఇక దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే ఆయన వరుస సినిమలతో బిజీబిజీగా ఉన్నారు. చివరిగా పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆయన. ఇక హిందీలో ఆయన జెర్సీ రీమేక్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











