twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఎఫ్ 2’ 50 డేస్ సెలబ్రేషన్స్... నవ్వు విలువ రూ. 130 కోట్లు!

    |

    వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఎఫ్ 2 చిత్రం వరల్డ్ వైడ్‌గా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్-లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం 50 రోజుల‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. దిల్‌రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 2 మూవీ 50 రోజుల వేడుక జ‌రుపుకోవ‌డానికి ముఖ్య కార‌ణం మా ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. మా హీరోలిద్ద‌రూ బిజీగా ఉండ‌టం వల్ల రాలేక పోయారని తెలిపారు.

    అందుకే రాజుగారి మీద ఒత్తిడి తెచ్చాను

    అందుకే రాజుగారి మీద ఒత్తిడి తెచ్చాను

    ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ - ``మా ఇద్దరు హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ ఊర్లో లేరు. వెంకటేష్ గారు రాజమండ్రిలో షూటింగులో ఉన్నారు. వరుణ్ ఎబ్రాడ్లో ఉన్నారు. ఫంక్ష‌న్‌ని పెడదామా? వద్దా? అనే అయోమయంలో దిల్ రాజు గారు ఉంటే, ఇలాంటి ఫంక్ష‌న్స్‌ని ప్ర‌తిసారి సెల‌బ్రేట్ చేసుకోలేం అని చెప్పి రాజుగారిపై ఒత్తిడి పెట్టాను. 50 డేస్ షీల్డ్ అంటే ఊరికే తీసుకోవడం కాదు. పదేళ్ల తర్వాత దాన్ని చూస్తే ఈ సినిమా సక్సెస్‌కు సంబంధించిన విషయాలు మన మైండ్‌లో గిర్రున తిరగాలి. ఆ గుర్తుగా అయినా షీల్డ్ ఉండాలని ఈ ఫంక్షన్ చేయమని చెప్పాను అన్నారు.

    నవ్వు విలువ రూ. 130 కోట్లు

    నవ్వు విలువ రూ. 130 కోట్లు

    ఎఫ్ 2 సినిమా అనగానే మొదట గుర్తుకువచ్చేది నవ్వు. ఒక నవ్వు విలువ ఇంత ఉందా? దాదాపు 107 కేంద్రాల్లో ఈ చిత్రం 50 డేస్ పూర్తి చేసుకుంది. రూ. 130 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ జ‌న‌రేట్ చేసింది. నేను చేసిన నాలుగు సినిమాల్లో కష్టపడకుండా ఆడుతూ పాడుతూ ప్రతి రోజూ నవ్వుకుంటూ పని చేశాం. ఆ నవ్వు విలువ తెలిసి నవ్వు మీద గౌరవం మరింత పెరిగింది.

    వారి సినిమాలే నాకు లైబ్రరీ

    వారి సినిమాలే నాకు లైబ్రరీ

    నేను చేసిన నాలుగు సినిమాల్లో హాస్యానికి పెద్ద పీట ఉంటుంది. నేనేదో దాంట్లో గొప్ప అని నా ఫీలింగ్ కాదు. నేను నా సినిమాల్లో ఇంత న‌వ్వును పుట్టించడానికి కార‌ణం జంధ్యాల‌గారు, ఈవీవీగారు, ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారు. వీరు తీసిన సినిమాలు చూసి, ఇన్ స్పైర్ అయ్యి, ఈ రోజు నేను చేసే సినిమాల్లో హాస్యాన్నీ వర్కౌట్ చేయగలుగుతున్నాను. నేను వారి వద్ద పని చేయక పోయినా వారు తీసిన సినిమాలే నాకు లైబ్రరీ.

    వెంకీ గారి ముందు వరుణ్ బ్యాలెన్స్ తప్పలేదు

    వెంకీ గారి ముందు వరుణ్ బ్యాలెన్స్ తప్పలేదు

    ఎఫ్ 2 సినిమా వెంక‌టేష్‌గారు, వ‌రుణ్ లేకుండా ఊహించ‌లేను. 14 ఏళ్ల క్రితం వెంక‌టేష్‌గారు నువ్వునాకు న‌చ్చావ్ అని పూర్తిస్థాయి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా చేశారు. తర్వాత అలాంటి ఫుల్ ఎంటర్టెన్మెంట్ జోనర్లో సినిమా చేయలేదు. దాని స్ట్రెంత్ ఏమిటో ఎఫ్ 2 సినిమా ద్వారా చూశాం. ఎంటర్టెన్మెంటులో వెంకటేష్ గారిది ఒక రేంజ్. అలాంటి వ్యక్తి ముందు వరుణ్ తేజ్ ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా కామెడీ చేశాడు. అలాగే త‌మ‌న్నా, మెహరీన్‌, ప్రగతిగారు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, అన‌సూయ‌గారుఇలా ప్ర‌తి ఆర్టిస్ట్ నాకు స‌పోర్ట్ ఇచ్చారు. నా సినిమాకు పని చేసిన టెక్నీషియన్లందరికీ థాంక్స్‌. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, ల‌క్ష్మ‌ణ్‌గారు నా ఫ్యామిలీతో స‌మానం. నా జ‌ర్నీలో నా త‌ల్లిదండ్రులు, వైఫ్ కంటే వాళ్ల‌తోనే ఎక్కువ‌గా గడిపారు. వారితో 4 సినిమాలు చేశాను. నాకు ఏ క‌ష్టం రానీయ‌కుండా బాగా చూసుకుంటారని.. అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

    English summary
    F2 Fun and Frustration Movie 50 days Celebrations at Hyderabad. Mehreen Kaur Pirzada, Anasuya, Anil Ravipudi, Dil Raju, Shirish, K Raghavendra Rao, Rajendra Prasad, Prudhviraj, Raghu Babu at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X