For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiru154: పూనకాలు తెప్పించేలా చిరంజీవి టీజర్.. ముందే లీక్ చేసిన డైరెక్టర్

  |

  మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. అలాగే, ఇటీవలే 'గాడ్ ఫాదర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు కలెక్షన్లు కూడా పోటెత్తుతున్నాయి. ఫలితంగా హిట్‌ టాక్‌తో ఇది దూసుకుపోతోంది. ఈ ఉత్సాహంతోనే చిరంజీవి తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన 154వ చిత్రాన్ని కూడా త్వరలోనే తీసుకు రాబోతున్నారు.

  Dethadi Harika Marriage: షాకిస్తోన్న దేత్తడి హారిక పెళ్లి వార్త.. ఆ యూట్యూబర్‌తోనే లవ్ మ్యారేజ్!

  మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన 154వ సినిమాగా 'వాల్తేరు వీరయ్య' (పేరు అధికారికంగా ప్రకటించలేదు)ను పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది. అలాగే, ఈరోజు నుంచే ఈ మూవీ డబ్బింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి ముందుగానే లీకైంది.

  Director Bobby Confirms Valtheru Veerayya Movie Teaser Date

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీ నుంచి టీజర్‌ను దీపావళి పండుగ కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ 'కంగ్రాట్స్ డియర్ సర్‌జీ. నీ కల నిజం కాబోతుంది. దీపావళి టీజర్‌పై ఆసక్తిగా ఉన్నా. చిరంజీవి సార్ ఫైర్‌గా కనిపించారు. దీనికోసం బ్యాగ్రౌండ్ స్కోర్ పూర్తి చేశాను' అని ట్వీట్ చేశాడు. దీన్ని కన్ఫార్మ్ చేస్తూ 'థ్యాంక్యూ సర్‌జీ. మీరు మీ వర్క్‌తో టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకు వెళ్లారని మేము నమ్మకంతో ఉన్నాము. ఈ దీపావళికి ప్రేక్షకులందరికీ మా బాస్ ఫస్ట్ గ్లిమ్స్‌ను చూపించడానికి ఆగలేకపోతున్నాము' అంటూ ట్వీట్ పెట్టాడు.

  Director Bobby Confirms Valtheru Veerayya Movie Teaser Date

  కార్తీక దీపం హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ: అక్కినేని హీరోతో వంటలక్క.. ఏ పాత్ర చేస్తుందంటే!

  మెగాస్టార్ చిరంజీవి - బాబీ కలయికలో రాబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  English summary
  Megastar Chiranjeevi Now Doing Valtheru Veerayya Movie Under K. S. Ravindra Direction. Now Director Bobby Clarity on This Movie Teaser.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X