»   » జిమ్‌లో బైచిప్స్ చూపించావు, ఇక్కడ కూడా: సమంతపై దర్శకురాలు ఫన్నీకామెంట్

జిమ్‌లో బైచిప్స్ చూపించావు, ఇక్కడ కూడా: సమంతపై దర్శకురాలు ఫన్నీకామెంట్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటించిన 'యూటర్న్' మూవీ బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తుండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన దర్శకురాలు నందినీ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు పవన్ కుమార్ డైరెక్ట్ చేశారు.

  నందినీ రెడ్డి మాట్లాడుతూ... పవన్ కుమార్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు తీసుకురావడం ఆనందంగా ఉంది. మన దేశంలో కొంత మంది గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్ లాంటి వారి సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా? అని వెయిట్ చేస్తూ ఉంటాను. అలాంటి వారిలో పవన్ కుమార్ ఒకరు... అని నందినీ రెడ్డి అన్నారు.

  సమంత సినిమా వైపు టర్నింగ్ ఇచ్చుకున్న తెలంగాణ ఏంపీ కవిత (ఫోటో గ్యాలరీ)

  పవన్ నాకు మంచి ఫ్రెండ్ కూడా. మేము ఇద్దరం చాలా విచిత్రంగా కలిశాం. ఆయన తన ల్యాప్ టాప్‍‌లో లూసియా సినిమా పెట్టుకుని చూస్తున్నారు. ఒక నిర్మాత ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. నేను వెళ్లి కలిస్తే నన్ను రీమేక్ చేయమన్నారు. బడ్జెట్ ఎంత? అని అడిగితే 50 లక్షలు అని చెప్పారు. నేను వెంటనే షాకయ్యాను. ఇంత తక్కువ ఖర్చుతో అద్భుతంగా ఎలా తీశారు అనిపించింది.

  Director Nandini Reddy About Samantha at U Turn Success Meet

  పవన్ కుమార్‌ను మీరెందుకు చేయట్లేదు అని అడిగితే నన్ను అడగలేదండీ అన్నారు. అపుడు నేను నిర్మాతకు ఒకటే చెప్పాను... ఈ సినిమా చేస్తే పవన్ చేయాలి, నేను కరెక్ట్ కాదు అని చెప్పాను. ఇంత బాగా చేసినపుడు ఆయనకు ఇంకో కోటి రూపాయలు ఇవ్వండి అద్భుతంగా చేస్తారు అని చెప్పాను. ఎట్టకేలకు అతడు తెలుగులోకి వచ్చారు. 'యూ టర్న్' మూవీ మంచి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. సినిమాలో అందరూ బాగా చేశారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

  సమంత గురించి మాట్లాడుతూ... 'స్కూల్ లో కొంత మంది పిల్లలు ఉంటారు. ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటారు. కానీ మాథ్స్‌లో 99 వస్తే 100 రావాలని ట్రై చేస్తుంటారు. సమంత అలాంటి నటి. తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి పరిచయం. అప్పటికీ, ఇప్పటికీ ఏ మార్పు లేదు. చాలా హార్డ్ వర్కర్. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వదు. ఆ మాత్రం టాలెంట్ నాలో ఉంటే నాకు ఆస్కార్ వచ్చేది. సమంత... నువ్వు జిమ్ లో బైచిప్స్ మాత్రమే కాదు, ఇపుడు బాక్సాఫీసు వద్ద కూడా నీ పవర్ చూపించావు... అని నందినీ రెడ్డి వ్యాఖ్యానించారు.

  English summary
  Director Nandini Reddy Funny Speech About Samantha at U Turn Success Meet. U Turn directed by Pawan Kumar. Filmed simultaneously in Tamil and Telugu languages, it is a remake of his own 2016 Kannada film of the same name. The bilingual stars Samantha Akkineni in the lead role alongisde Aadhi Pinisetty, Rahul Ravindran and Bhumika Chawla.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more