twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ED ఆఫీసుకు కొడుకుతో వచ్చిన పూరీ.. అరగంట ముందే, మీడియాతో మాట్లాడకుండా సైలెన్స్.. ఏం జరుగుతోంది?

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మొత్తం 12 మంది టాలీవుడ్ ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఒక్కొక్కరికి ఒక్కో తేదీ కూడా ఇవ్వడం తో పాటు ఈ రోజు పూరి జగన్నాథ్ ని తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ కొద్దిసేపటి క్రితమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    Priyanka Chopra భర్తతో డోస్ పెంచిన బికినీ భామ.. మీరెప్పుడూ చూడని ప్రియాంక బీచ్ ఫోటోలు!Priyanka Chopra భర్తతో డోస్ పెంచిన బికినీ భామ.. మీరెప్పుడూ చూడని ప్రియాంక బీచ్ ఫోటోలు!

    సెప్టెంబర్ 22వ తేదీ వరకు

    సెప్టెంబర్ 22వ తేదీ వరకు

    గతంలో మరుగున పడింది అనుకుంటున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఈడీ విచారణ జరపడం సంచలనంగా మారింది. ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసేందుకు గాను గతంలో విదేశాలకు పెద్ద ఎత్తున డబ్బులు తరలించినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. అందులో భాగంగానే ఈ కేసులో గతంలో విచారణ ఎదుర్కొన్న వారితో సహా మరో ఇద్దరు సినీ ప్రముఖులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొద్ది రోజుల క్రితం నోటీసులు పంపారు. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు చొప్పున ఈరోజు నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఈడీ అధికారులు విచారణ జరపనున్నారు

    ఎలా కొనుగోళ్లు జరిపారు ?

    ఎలా కొనుగోళ్లు జరిపారు ?

    విదేశాలకు ఎలా నిధులు మళ్లించారు ? అక్కడి నుంచి ఎలా కొనుగోళ్లు జరిపారు ? అనే విషయం మీద ఈడీ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో ఈ కేసు విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అధికారి సోమవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులతో భేటీ అయి తాము జరిపిన విచారణ నివేదిక సైతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమర్పించారు. ఇక ఈ పన్నెండు మందిని విచారించిన తర్వాత కూడా ఎలాంటి ఉపయోగం లేదు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తే కనుక గతంలో ఎక్సైజ్ శాఖ విచారణకు 50 మందికి కూడా మళ్లీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

    ఆ చట్టాలను ఉల్లఘించి

    ఆ చట్టాలను ఉల్లఘించి

    ఈ డ్రగ్స్ కేసు వ్యవహారంలో కొనుగోలు జరిపేందుకు గానూ హవాలా ద్వారా మనీలాండరింగ్ ఫెమా చట్టాలను ఉల్లంఘించినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించడమే కాక డ్రగ్స్ కోసమే భారీ ఎత్తున డబ్బులు విదేశాలకు విదేశీ ఖాతాలో జమ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే సెలబ్రిటీలకు డ్రగ్స్ అమ్మినట్లు గా భావిస్తున్న కెల్విన్, విక్టర్, కమింగా అనే ముగ్గురు వ్యక్తులు స్టేట్మెంట్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సేకరించారు. ఇక డబ్బులు ఎలా విదేశాలకు పంపే వారు అనే విషయం మీద ఇంటర్పోల్ సాయం కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

    ముందే కొడుకుతో

    ముందే కొడుకుతో

    ఇక ఉదయం పదిన్నర గంటలకు పూరి జగన్నాథ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన 10 గంటల 5 నిమిషాలకు ఆఫీస్ కు చేరుకున్నారు. అయితే ఆయనతో మాట్లాడటానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా సరే పూరి జగన్నాథ్ స్పందించకుండా వెంటనే కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఈడీ సిబ్బంది సైతం ఆయనను మెట్ల మార్గం నుంచి పైకి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. పదిన్నరకు ఆయన విచారణ ప్రారంభం కానుంది. ఈ విచారణ మధ్యాహ్నం వరకు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

    Recommended Video

    Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
    ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు ?

    ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు ?

    ఈ విచారణలో భాగంగా పూరి జగన్నాథ్ ని ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు ? ఆయన ఎలాంటి సమాధానాలు ఇవ్వనున్నారు అనే విషయం మీద ఆసక్తి నెలకొంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన తనయుడు ఆకాష్ పూరి, పూరి చార్టెడ్ అకౌంటెంట్ లు కూడా ఉన్నారు. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గా ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఏ రూపంలో కొనుగోలు చేశారు అన్న కోణంలో విచారణ జరగనుందని అంటున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈడీ విచారణ జరగనుంది.

    English summary
    From today, the entire 12 celebrities will be questioned in Tollywood Drugs Case by ED. On the first day, director Puri Jagannath will be questioned by the ED authorities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X