twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV Kantara: సినీ ఇండస్ట్రీలు అతనికి ట్యూషన్ ఫీ చెల్లించాలి.. కాంతార చిత్రంపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్స్

    |

    మంచి కంటెంట్ ఉన్న సినిమా చిన్నదైనా, అది ఎక్కడ ఉన్నా.. ఏ ఇండస్ట్రీది అయినా సినీ లోకానికి పరిచయం చేసి హిట్ అందిస్తారు ప్రేక్షకులు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట పలుకుతున్న సినిమానే కాంతార. కన్నడ హీరో రిషబ్ షెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ మూవీ ముందుగా సెప్టెంబర్ 30న విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వస్తున్న క్రేజ్ చూసి సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలీంస్ ప్రాంతీయ భాషల్లోనూ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీ చూసిన ఎంతోమంది సెలబ్రిటీలు కాంతారపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాపై సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశాడు.

    పూనకాలు పెట్టిస్తున్న సినిమా..

    పూనకాలు పెట్టిస్తున్న సినిమా..

    కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన కేజీఎఫ్ దేశవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. మళ్లీ అదే పరిశ్రమ నుంచి వచ్చి ప్రేక్షకులతో పూనకాలు పెట్టిస్తున్న సినిమా కాంతార. ఈ సినిమా కన్నడలో ఇంగ్లీష్ వెర్షన్ తో విడుదలై దేశవ్యాప్తంగా హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలీంస్ ప్రాంతీయ భాషల్లో కూడా రిలీజ్ చేసింది.

    సెలబ్రీటీలు సైతం..

    ఈ క్రమంలోనే తెలుగులో అక్టోబర్ 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాంతార. కన్నడ హీరో రిషబ్ షెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆడియెన్స్ అందరూ జేజేలు కొడుతున్నారు. అలాగే సినీ సెలబ్రీటీలు సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

    ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా కాంతార సినిమాపై సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్ లో పోస్ట్ లు పెట్టాడు. ''ఫస్ట్ రిషబ్ షెట్టి ఇంటర్వ్యూ కచ్చితంగా చూడండి. సింప్లిసిటీ, ఇన్నోసెన్స్ వల్లే కాంతార వంటి గొప్ప చిత్రాలు వస్తాయని, ఓవర్ థింకింగ్ వల్ల కాదని రిషబ్ షెట్టి నిరూపించాడు'' అని ట్వీట్ పెడుతూ రిషబ్ షెట్టి ఇంటర్వ్యూ లింక్ ఇచ్చాడు ఆర్జీవి.

    భారీ చిత్రాలు రూపొందించేవారికి పీడకల..

    అలాగే మరొక ట్వీట్ లో ''అలాగే భారీ చిత్రాలు రూపొందించేవారికి కాంతార వంటి చిత్రం ఒక పీడకల. అది వాళ్లను అర్ధరాత్రి మేల్కోనేలే చేసి నిద్రపట్టకుండా చేసింది. డెవిల్ గా పిలిచే రిషబ్ షెట్టికి థ్యాంక్స్''. ''అతి భారి బడ్జెట్ చిత్రాలే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయనే అపోహను రిషబ్ షెట్టి బద్దలు కొట్టాడు. కాంతార చిత్రం రాబోయే తరాలకు ఒక గుణపాఠం అని తెలిపాడు'' ఈ డైరెక్టర్.

    మీకు ట్యూషన్ ఫీ చెల్లించాలి..

    ''కాంతార సినిమా రూపంలో గొప్ప గుణపాఠం నేర్పిన రిషబ్ షెట్టికి థ్యాంక్స్. అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలు మీకు ట్యూషన్ ఫీ చెల్లించాలి''. ''ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో రిషబ్ షెట్టి ఒక హీరో.. రూ. 300, 400, 500 కోట్లు పెట్టి సినిమా తీసేవారికి కాంతార మూవీ కలెక్షన్లతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోంది'' అంటూ ట్వీట్ లో రామ్ గోపాల్ వర్మ రాసుకొచ్చారు.

    అత్యధికంగా 9.4 రేటింగ్ తో..

    ఇప్పటివరకు రిషబ్ షెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు వసూలు చేసిందని టాక్. అలాగే సినిమాలకు రేటింగ్ ఇచ్చే ఐఎండీబీలో అత్యధికంగా 9.4 రేటింగ్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం కంబాలా, కోలా సాంప్రదాయాల నేపథ్యంలో హోంబలే ఫిలీంస్ సంస్థ తెరకెక్కించించింది.

    English summary
    Director Ram Gopal Varma Praise Rishab Shetty For Kantara Movie And Says All Film Industry Will Pay Tution Fee To Him For Teaching Lesson Like Kantara Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X