twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోబో సినిమా వల్ల చిక్కుల్లో పడిన డైరెక్టర్ శంకర్.. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

    |

    సంచలన దర్శకుడు శంకర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. ఒక్కసారిగా ఆయన అభిమానులను ఈ న్యూస్ ఆశ్చర్యానికి గురి చేసింది. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండే కూల్ డైరెక్టర్ శంకర్ ఊహించని విధంగా ఓ కేసులో సమస్యల్లో చిక్కుకోవడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని ఎగ్మోర్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేశారు.

    ప్రపంచాన్ని ఆకర్షించించేలా

    ప్రపంచాన్ని ఆకర్షించించేలా

    దర్శకుడు శంకర్ చాలా వరకు కూల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. సినిమానే ప్రపంచంగా భావించే ఆయన ఎంతో బాధ్యతగా ఆలోచించి సినిమాలు తీస్తారు. ఆయన రోబో కథ క్లైమాక్స్ చూసి అవేంజర్స్ ఎండ్ గేమ్ లో అదే ఫార్ములా వాడినట్లు ఏకంగా హాలీవుడ్ దర్శకుడే చెప్పారు. అంత గొప్పగా ప్రపంచాన్ని ఆకర్షించించేలా ఆ సినిమాను తీశారు.

     రోబో పై.. కాపీ ఆరోపణలు

    రోబో పై.. కాపీ ఆరోపణలు

    అయితే ఫైనల్ గా రోబో కథ కారణంగానే ఆయన సమస్యల్లో ఇరుక్కున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. 'జిగుబా' అనే పుస్తకం కథ ఆధారంగా కథను కాపీ కొట్టినట్లు గతంలోనే చాలా ఆరోపణలు వచ్చాయి. శంకర్‌ 'రోబో' చిత్రం తనదే అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా విషయం హాట్ టాపిక్ గా మారింది.

    ఆ కథ ఆధారంగానే..

    ఆ కథ ఆధారంగానే..

    రోబో సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఆ సినిమాకు మంచి క్రేజ్ దక్కింది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు తమిళ్ లో కూడా అత్యదిక వసూళ్లను అందుకుంది. అయితే ఆ సినిమాను అరుర్‌ తమిళ్‌నందన్‌ రచించిన 'జిగుబా' కథను కాపీ కొట్టినట్లు సినిమా విడుదలైన సనయంలోనే కేసు నమోదైంది.

    కోర్టును ఆశ్రయించిన రచయిత

    కోర్టును ఆశ్రయించిన రచయిత

    రైటర్ అరుర్‌ తమిళ్‌నందన్‌ రాసిన 'జిగుబా' కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురించారు. అనంతరం ఆ స్టోరీని 2007లో ఓ నవలగా ముద్రించారు. ఇక రోబోలో ఉన్న అసలు కథ తన నవల ఆధారంగానే తెరకెక్కించరని ఆ రచయిత స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం శంకర్‌ను విచారణకు హాజరు కావాల్సిందిగా పలుమార్లు ఆదేశాలు జారీచేసింది.

    Recommended Video

    2.0 Hindi Version To Surpass The Lifetime Business Of Robot On The 1st Day Itself | Filmibeat Telugu
    నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

    నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

    ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా కూడా శంకర్ నుంచి సమాధానం రాలేదు. అదే విధంగా న్యాయస్థానం ఎదుట కూడా హాజరుకాక పోవడంతో శంకర్ పై కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది. ఇక శంకర్ ఈ విషయంపై వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సీనియర్ డైరెక్టర్ కమల్ హాసన్ ఇండియన్ 2 తో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

    English summary
    Director shankar robot movie copy allegation and non bailable warrant
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X