డాన్లీ, ప్రభాస్ కు ఉన్న సేమ్ క్వాలిటీ.. ఇక థియేటర్లు బద్దలవ్వాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. తన రాబోయే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ నుంచి నెక్ట్స్ రాబోయే చిత్రాల్లో స్పిరిట్ మోస్ట్ అవైటెడ్ గా ఉంది. ఈ సినిమా ప్రకటించిన సమయం నుంచి ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా? అని ఆశగా చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్ గా నటించబోయే డాన్ లీ గురించి ఆసక్తికరమైన వివరాలు ఇలా ఉన్నాయి..

ఇప్పటికే డాన్ లీని విలన్ గా ఎంపిక చేసినట్టుగా పరోక్షకంగా సందీప్ రెడ్డి వంగ ప్రకటించారు. ఈ సందర్భంగా డాన్ లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక డాన్లీ కొరియన్ చిత్ర పరిశ్రమ నుంచి హాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు. అమెరికన్ యాక్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక డాన్లీ అసలు పేరు మా డాంగ్ సియోక్. ఆయన సియోల్ లో మార్చి 1న 1971లో జన్మించారు. చిన్నప్పటి నుంచే డాన్ లీకి బాక్సింగ్, ఫిట్ నెస్ పై ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నారు. ఇక సియోల్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

Don lee and Prabhas have same Quality

ఆ తర్వాత యాక్షన్ స్కిల్స్, స్టంట్స్ పై డాన్ లీ మంచి పట్టు సాధించారు. ఆ తర్వాత నుంచి డాన్ లీకి పర్సనల్ ట్రైనర్ గా కూడా ప్రముఖుల నుంచి ఆఫర్స్ అందుకున్నారు. 2004లో డ్యాన్స్ విత్ విండ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు నటుడిగా చిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. 2016లో వచ్చిన ట్రెయిన్ టు బుసన్ అనే చిత్రంతో డాన్ లీకి మంచి గుర్తింపు దక్కింది. స్టార్ డమ్ ను సాధించుకున్నారు. ఆయన చిత్రాలు కేన్స్ లోనూ ప్రదర్శితం అవ్వడం విశేషం. ది అవుట్ లాస్, ది గ్యాంగ్ స్టర్, ది కాప్, ది డెవిల్, యాక్షన్ త్రిల్లర్ బ్యాడ్ లాండ్ హంటర్స్ అనే చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు.

ఇక నెక్ట్స్ ప్రభాస్ తో కలిసి స్పిరిట్ చిత్రంలో నటించబోతున్నారు. అయితే ప్రభాస్ కు, డాన్ లీకి సేమ్ క్వాలిటీస్ ఉండటం విశేషం. ప్రభాస్ వేదికలపై ఎక్కువగా మాట్లాడారు. కానీ సెట్స్ లో మాత్రం ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటారు. అలాగే అందరినీ ప్రేమతో చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ గురించి ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేకపోవడంతో విశేషం. పైగా ప్రతి ఒక్కరితో ప్రభాస్ మంచి వాడనే బ్రాండ్ ను సంపాదించుకున్నారు. కానీ కెమెరా ముందుకు వస్తే మాత్రం నట బీభత్సం సృష్టిస్తారు. యాక్షన్ సీన్లలో దుమ్ములేపుతారు.

అయితే డాన్లీ కూడా సేమ్ ప్రభాస్ లాగే మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఆయనకు ఎక్కువ శాతం ప్రశంసలే ఉన్నాయి. ఇక నెగెటివ్ కామెంట్ లేకపోవడం విశేషం. ఇక డాన్లీ కూడా తన నటనతో ఎలాంటి స్పందనను సాధించుకున్నారో తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ స్పిరిట్ చిత్రంలో తలపడితే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక స్పిరిట్ చిత్రంలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ లో నిర్మిస్తుండటం విశేషం.

More from Filmibeat

Read more about: prabhas don lee spirit
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X