twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనుసూద్‌కు ఆలయం కట్టించిన సిద్దిపేట గ్రామస్థులు.. రియల్ హీరో రియాక్షన్ ఏమిటంటే!

    |

    లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను అక్కున చేర్చుకొన్న బాలీవుడ్ నటుడు సోనుసూద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. సోనుసూద్ చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణాలోని సిద్దిపేటలోని దుబ్బ తండా గ్రామస్థులు ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో సోనుసూద్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రస్తుతం సోనుసూద్ ఆలయానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

    సిద్దిపేటలోని దుబ్బ తండా గ్రామస్థులు నటుడు సోనుసూద్ సేవలకు అరుదైన గుర్తింపునిచ్చారు. ఆయనకు గుడికట్టి పూజలు నిర్వహించారు అని ప్రముఖ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

    Dubba Tanda of Siddipet villagers built temple for Sonu Sood

    కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో సోనుసూద్ ఎంతో మందికి అండగా నిలిచారు. ఆయన చేసిన సేవలతో మేము స్పూర్తి పొందాం. అందుచేతనే ఆయనకు ఆలయం నిర్మించాం అంటూ స్థానికుడు మీడియాకు వెల్లడించారు.

    Dubba Tanda of Siddipet villagers built temple for Sonu Sood

    తనకు గుడి కట్టించిన వార్తపై నటుడు సోనుసూద్ స్పందించారు. ఆ విషయం నాకు చాలా సంతోషం కలిగించింది. కానీ వారు ప్రేమతో అందించిన పనికి నేను అర్హుడిని కాను. ఓ సాధారణ వ్యక్తిగా నా సోదరి సోదరులకు అందించిన సహాయం మాదిరిగానే నేను చేయూత ఇచ్చాను అని సోనుసూద్ పేర్కొన్నారు.

    English summary
    Dubba Tanda of Siddipet villagers built temple for Sonu Sood. Telangana: Locals of Dubba Tanda village in Siddipet have constructed a temple to recognize Actor Sonu Sood's philanthropic work. A local says, "He helped so many people during the pandemic. It's a matter of great delight for us that we've constructed his temple."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X