మొత్తానికి F3 మూవీ పట్టాలెక్కింది.. అ విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సీక్వెల్స్ మొదలవుతున్నాయి. అయితే ఇంతవరకు మన దగ్గర సీక్వెల్స్ అలాగే ఫ్రాంచైజ్ ద్వారా వచ్చిన సినిమాలు పెద్దగా హిట్టవ్వలేదు. కానీ ఈ సారి దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం గ్యారెంటీ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది. F2 సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ హిట్ కొట్టిన అనిల్ ఇప్పుడు F3ని స్టార్ట్ చేశాడు.

ఈ రోజు ఉదయమే సినిమాకు సంబంధించిన ముహూర్త కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ లాంచ్ వేడుకలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మొదటి క్లాప్ కొట్టారు. వరుణ్ తేజ్ తమన్నా అలాగే నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కూడా వేడుకలో పాల్గొన్నారు. రెగ్యులర్ షూటింగ్ ను డిసెంబర్ 23న నుంచి స్టార్ట్ చేయనున్నారట. ఇక సినిమాలో మరొక హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రవితేజ, సాయి ధరమ్ తేజ్ అంటూ రూమర్స్ చాలానే వచ్చాయి కానీ ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు.

Finally Venkatesh Varun tej f3 movie launched

దర్శకుడు అనిల్ ఈ సినిమాను మనీ బ్యాక్ గ్రౌండ్ లోనే తెరకెక్కించనున్నట్లు ఇటీవల ఒక పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేశాడు. ఇక హీరోయిన్స్ విషయంలో మార్పులు జరగనున్నట్లు మొదట్లో టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ తమన్నా, మెహ్రీన్ మళ్ళీ అదే పాత్రల్లో హీరోలతో రొమాన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు అయితే భరిగానే ఉన్నాయి. ఇక సినిమాను సమ్మర్ అనంతరం రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X