For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డైరెక్టర్‌పై తూ అనే ఊసిన స్టార్ హీరోయిన్.. అసలు కథ ఏంటంటే..?

  |

  ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది రష్మిక మందాన్న. మొదటి చిత్రమే సక్సెస్ కావడం, రష్మిక లుక్స్, యాక్టింగ్ బాగుండటం ఇలా అన్నీ రష్మికకు కలిసొచ్చాయి. అటుపై గీత గోవిందం లాంటి చిత్రంలో అవకాశం రావడం, అది తిరుగులేని విజయం సాధించడంతో రష్మిక అదృష్టం.. దరిద్రం పట్టినట్టు పట్టింది. ఇక ఈ చిత్రం తరువాత రష్మిక తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది.

  డియర్ కామ్రేడ్ పోయినా..

  డియర్ కామ్రేడ్ పోయినా..

  ఎన్నో అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్ పోయినా.. రష్మికకు కలిసి వచ్చింది. ఈ చిత్రంతో మొత్తం దక్షిణాదిన స్టార్ స్టేటస్ పొందాలనుకున్న రష్మికకు తీవ్ర నిరాశే ఎదురైంది. సినిమా పోయినా.. లిల్లీ పాత్రలో రష్మిక అందరూ కనెక్ట్ అయ్యారు. ఆమె పాత్రకు, నటనకు మంచి మార్కులే పడ్డాయి.

  వరుసగా స్టార్ల సరసన..

  వరుసగా స్టార్ల సరసన..

  డియర్ కామ్రేడ్ తన భవిష్యత్ ప్రాజెక్ట్‌లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. వెను వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ సినిమాలో అవకాశాన్ని కొట్టేసింది. అంతేకాకుండా తనకు మొదటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఓ చిత్రాన్ని చేస్తోంది. ఇందులో నితిన్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

  భీష్మపై అంచనాలు..

  భీష్మపై అంచనాలు..

  నితిన్-రష్మిక కాంబోలో రాబోతోన్న భీష్మపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. భీష్మ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ను క్రియేట్ చేశాయి. వీరిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ సినిమాకే హైలెట్‌గా నిలవబోతోంది. ప్రస్తుతం వీరిద్దరు సాంగ్ షూట్ కోసం రోమ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

  సాంగ్ ప్రమోషన్‌లో భాగంగా..

  ఈ మూవీ నుంచి మొదటి పాట సింగిల్స్ ఆంథమ్ అనే పాట రాబోతోందని, చాలా బాగుంటుందని నితిన్ చెబుతూ ఉంటాడు.. పక్కనే ఉన్న రష్మిక సైలెంట్‌గా ఉండటంతో.. నువ్వు కూడా చెప్పొచ్చు కదా? అని ఆమెను అడుగుతాడు. నేను ఆ పాటలో లేను కదా.. అలాంటప్పుడు ఎందుకు చెబుతాను... ఇంత మంచి పాటలో తనను ఎందుకు పెట్టలేదని తిరిగి ప్రశ్నిస్తుంది.

   తూ అనే ఊసేసిన రష్మిక..

  తూ అనే ఊసేసిన రష్మిక..

  అలా రష్మిక అడిగే సరికి.. డైరెక్టర్ వెంకీ కుడుములను పిలుస్తాడు నితిన్. ఈయనతో మాట్లాడు అంటూ డైరెక్టర్‌ను చూపిస్తాడు.. ‘నా ఫేవరేట్ సాంగ్‌లో నేను ఎందుకు లేనం'టూ ఆ డైరెక్టర్‌పై ఫైర్ అవుతుంది రష్మిక. ‘ఈ సీన్‌లో నాకు డైలాగ్‌లు లేవు' అంటూ డైరెక్టర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఆగూ అంటూ రష్మిక అరిచి.. మొహం చూపించు అంటూ తూ అనే ఊసేసింది. దీంతో హీరో, దర్శకుడు తలలు తిప్పేసుకున్నారు. సో ఇది జరిగింది. ఈ తతంగం అంతా చూస్తుంటే.. భీష్మ ఫస్ట్ సింగిల్ కోసం బాగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.

  English summary
  First Single Will Be Coming Soon From Nithin And Rashmika Bheeshma. This Movie Is Directed By Venky Kudumula. This Movie Is Produced Under Sitara Entertainments By Naga Vamsi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X