‘ప్రభాస్‌ అంటే నాకు చెప్పలేనంత పిచ్చి.. నాలో ఆ కోణం బయటికి వస్తే మటాష్’

తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న స్ట్రీమింగ్ కానుంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరేనంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఏ పేరు బయటకు రాలేదు. వీరిలో ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ కూడా ఒకరు. జానపద నృత్యాలు, పాటలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు 9లో ఆవిడ ఎంట్రీ ఇస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో ఆవిడ ఇంటర్వ్యూల కోసం మీడియా క్యూకడుతోంది. తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగదుర్గా .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫోక్ సాంగ్స్‌తో పాపులర్
యూట్యూబ్‌లో అందరి మాదిరిగా వ్లాగింగ్ చేయకుండా జానపద గీతాలు, డ్యాన్స్‌తో పాపులర్ అయ్యారు నాగదుర్గ. తిన్నాతరం పడతలే, ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి, దారిపొంటత్తుండు, నా పేరే ఎల్లమ్మ వంటి పాటలతో తెలుగునాట సంచలనం రేపింది. ఈవిడ చిన్నప్పటి నుంచే డ్యాన్సర్ కావాలని కలలు కనింది. నాలుగేళ్ల వయసులోనే కూచిపూడి నేర్చుకున్నారు. ఆ తర్వాత 14 ఏళ్లకు పేరిణి నాట్యం నేర్చుకుని దేశవ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చింది. తన స్వగ్రామం నల్గొండలో నాగదుర్గ నృత్యాలయం కూడా స్థాపించి పలు చిన్నారులకు నాట్యం నేర్పింది.

Flok Dancer Naga Durga about Prabhas here s the details

ఒక్క సాంగ్‌తో సంచలనం
తిన్నాతిరం పడతలే పాటతో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఈ పాటతో ఆమెకు అవకాశాలు పోటెత్తాయి. పలు ఛానెల్స్‌లో అద్భుతంగా డ్యాన్స్‌లు చేసి స్టార్ డమ్‌ సంపాదించింది. ఈ క్రేజ్‌తో పలు చిత్రాల్లో నాగదుర్గాకు అవకాశం దక్కింది. అయితే అనివార్య కారణాలతో వాటిని ఆమె తిరస్కరించింది. నాట్యంలో ఎప్పటికైనా డాక్టరేట్ సాధించాలన్నది తన కల అని.. ఆ తర్వాతే సినిమాలలోకి వెళ్తానని నాగదుర్గ తెలిపారు. బిగ్‌బాస్‌ తెలుగు 9 కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఆమె పేరు వినిపిస్తుండటంతో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

పుస్తకాలు చినిగిపోతాయి
ఓ ఛానెల్‌తో నాగదుర్గ మాట్లాడుతూ.. నాకు ప్రభాస్ అంటే పిచ్చి, ఫ్యాన్ గాళ్ మూవ్‌మెంట్ వస్తే రెచ్చిపోతా. ప్రభాస్ సినిమా వస్తే చాలు థియేటర్‌లో పుస్తకాలు తీసుకెళ్లి చించి స్క్రీన్‌పై విసిరేసే దానిని. నా చిన్నప్పుడు నల్గొండలో వినాయకుడి విగ్రహాలు పెట్టి పండగ చేసుకునేవాళ్లం.. ఆ టైంలో నేను నాలుగో తరగతి చదువుతున్నా. అక్కడ వినాయకుడి బొమ్మ పెట్టే అన్నవాళ్లంతా ప్రభాస్ ఫ్యాన్సే. వాళ్ల నుంచి నాకు ప్రభాస్ పిచ్చి పట్టింది. అప్పటికే నేను ఫోక్ డ్యాన్స్ చేసే దానిని.. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నా చేత ప్రభాస్ పాటలకు డ్యాన్స్ చేసేదానిని. ఏ పాటకి డ్యాన్స్ చేసేదానిని కాదు.. కానీ ప్రభాస్ పాటలకు ఒప్పుకునేదానిని అని నాగదుర్గ తెలిపారు.

ప్రభాస్ టీ షర్ట్స్ గిఫ్ట్‌గా
అలాగే అన్నవాళ్లు ఏ ఆడియో లాంచ్‌కి వెళ్లినా నన్ను కూడా పిలుచుకుని వెళ్లేవారు. నాకు సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ డేకి టికెట్లు ఇచ్చేవాళ్లు.. అలాగే ప్రభాస్ టీ షర్ట్స్, కార్డ్స్, పోస్టర్లు ఇచ్చేవాళ్లు. వాటిని స్కూల్‌లో ఫ్రెండ్స్‌కి తీసుకెళ్లే దానిని, అలాగే న్యూఇయర్‌కి గ్రీటింగ్ కార్డ్స్ కాకుండా పెద్దపెద్ద పోస్టర్లు ఇచ్చేదానిని అని నాగదుర్గ తెలిపారు. టెన్త్ క్లాస్ వరకు నా రూమ్‌లో మొత్తం ప్రభాస్ పోస్టర్సే ఉండేవి, ప్రభాస్ టీషర్ట్స్‌తో నిండిపోయేది. రెబల్ సినిమా రిలీజ్ అయ్యాక ప్రభాస్ ఔట్‌ఫిట్స్ రిలీజ్ అయ్యేవి, వాటిని నేను వేసుకోవడంతో పాటు వాళ్లకి కూడా కొనిచ్చి వాళ్లు వేసుకుంటే హ్యాపీగా ఫీలయ్యే దానిని అని నాగదుర్గ తెలిపారు.

More from Filmibeat

Read more about: prabhas Bigg Boss Telugu 9
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X