twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరోసారి ఆంధ్ర ప్రదేశ్ థియేటర్స్ మూత.. ఆ విషయం తేలే వరకు తెరచుకోవడం కష్టమే..

    |

    కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమలకు దాదాపు ఏడాదిన్నర కాలం పాటు ఆదాయం లేకుండా పోయింది. ఆ మధ్య కాస్త సెట్టయ్యిందని అనుకునే లోపే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి తీవ్ర స్థాయిలో దెబ్బకొట్టింది. నిర్మాతలు కనీసం నిర్మించిన సినిమాలను ఓటీటీలో విడుదల చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ సినిమా థియేటర్స్ పై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర స్థాయిలో సతమతమయ్యాయి.

    ఇక మొత్తానికి థియేటర్స్ తెరచుకుంటున్న తరుణంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కు గురి చేసింది. సినిమా టికేట్ల రేట్లను బాగా తగ్గించడంతో నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉంది. అన్ని రకాల థియేటర్స్ లలో టికెట్స్ రేట్లను ఒకే ధరకు నిర్ణయించడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జ్ బ్యూటర్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

    తెలంగాణలో అయితే పాత రూల్స్ ప్రకారమే టికెట్ రేట్లను కేటాయించారు. ఆ విషయంలో టాలీవుడ్ పెద్దలు సంతృప్తిగానే ఉన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ రేట్లు ఏ మాత్రం సంతృప్తిగా లేవని ఇదివరకే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ సీఎంను సంప్రదించి వినతి పత్రాలను అందించారు. నిర్మాత సురేష్ బాబు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇక థియేటర్స్ టికెట్ చార్జీలపై కొత్త నిర్ణయం తీసుకునే వరకు థియేటర్స్ తెరవకూడదని ఏపీ థియేటర్స్ ఓనర్స్ నిర్ణయం తీసుకున్నారు.

    From 6th Aug all theaters in AP will Be Closed due to ticket rates issue

    ఆగస్ట్ 6నుంచి మళ్ళీ థియేటర్స్ మూత పడనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే చాలామంది థియేటర్స్ బిజినెస్ చేయలేక షాపింగ్ మాల్స్ లా మార్చేస్తున్నారు. మరికొన్ని పాత థియేటర్స్ ను కూల్చేసి అదే ప్లేస్ లో వివిధ రకాల బిజినెస్ లను ఓపెన్ చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే గత నెలలోనే 100% ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇక శుక్రవారం తిమ్మరుసు - ఇష్క్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

    రెండు సినిమాకు కూడా రెండున్నర కోట్లకు పైగా బాక్సాఫీస్ టార్గెట్ తో రంగంలోకి దిగాయి. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. అలాగే రానున్న రోజుల్లో టక్ జగదీష్, లవ్ స్టొరీ వంటి సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ టికెట్స్ రేట్లను పెంచిన తరువాతనే ఆ సినిమాలను రిలీజ్ చేస్తారట. ఇక రాధేశ్యామ్ సినిమా ముందు జాగ్రత్తగా వచ్చే ఏడాది సంక్రాంతికి వెళ్లిపోయింది. ఇక ఆచార్య సినిమా కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

    English summary
    From 6th Aug all theaters in AP will Be Clossed due to ticket rates issue, Theaters in AP will be reopening from 8th July. With 50% Occupancy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X