Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
విడుదలైన వారానికే ఓటీటీలోకి ‘గాలి సంపత్’: అధికారికంగా ప్రకటించిన ప్రముఖ సంస్థ
ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్లకే వెళ్లాల్సిన పరిస్థితి. కొన్నేళ్లకు టీవీలు అందుబాటులోకి రావడంతో విడుదలైన చాలా రోజులకు ఇంటిల్లిపాది కూర్చుని వాటిని తిలకించేవారు. అయితే, ఇప్పుడా పరిస్థితులు లేవు. థియేటర్లలోకి సినిమా వచ్చిన కొన్ని వారాలకే ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకూ ఇన్ని రోజుల అని ఓ లెక్క ఉండేది. కానీ, ఈ మధ్య దాన్ని ఎత్తేయడంతో చాలా తక్కువ సమయంలోనే కొత్త సినిమాలు ఓటీటీల్లో విడుదలైపోతున్నాయి. ఇందులో భాగంగానే ఓ సినిమా విడుదలైన వారానికే స్ట్రీమింగ్ కానుంది. అదే 'గాలి సంపత్'.
అనిష్ కృష్ణ దర్శకత్వంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్.. టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే 'గాలి సంపత్'. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. టాక్ మంచిగానే వచ్చినప్పటికీ.. 'జాతి రత్నాలు', 'శ్రీకారం' చిత్రాల నుంచి పోటీ విపరీతంగా ఉండడంతో మొదటి వారంలోనే దాదాపుగా థియేటర్ల నుంచి మాయమైపోయిందీ చిత్రం. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మార్చి 19 నుంచి అంటే విడుదలైన తొమ్మిదో రోజే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

'గాలి సంపత్'ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుగు సంస్థ ఆహా అధికారికంగా ప్రకటన కూడా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 'ఫ ఫ ఫ ఫన్‌తో కూడిన ఎంటర్‌టైనర్ మీ ముందుకు వచ్చేస్తుంది' అంటూ ఓ ట్వీట్ కూడా చేసింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించాడు. షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఎస్ కృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన లవ్‌లీ సింగ్ హీరోయిన్‌గా నటించింది.