Don't Miss!
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Finance
Bank Strike: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి..!
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Sports
IPL 2023 : ఆర్సీబీపై షాకింగ్ కామెంట్స్ చేసిన గేల్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Waltair Veerayya: ఆ టీవీ ఛానెల్‌లో వాల్తేరు వీరయ్య.. చిరంజీవి కెరీర్‌లోనే తొలిసారి
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. ఇలా సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న ఆయన.. రీఎంట్రీలో మరింత జోష్‌తో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' అనే మూవీని చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర రూపొందిస్తోన్న ఈ మూవీలో మరో స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే.
జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!
ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్‌తో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. అదే సమయంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసేసి ప్రేక్షకులకు సినిమాను చేరువ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది.

ఇద్దరు స్టార్ హీరోల కలయికలో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీని దర్శకుడు బాబీ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు సంబంధించిన డీల్ ఇటీవలే ముగిసినట్లు తెలిసింది. ఈ మూవీ హక్కులను జెమినీ టీవీ కొన్ని కోట్ల రూపాయలు చెల్లించి మరీ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇలా ఆయన మరో రికార్డునూ సాధించారని టాక్.
బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో బాబీ తీస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల కాబోతుంది.