Just In
- 1 hr ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 2 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 3 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 4 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గోవాలో ఆ పని చేసేశా.. నాగబాబు బాధ మాటల్లో చెప్పలేను.. గెటప్ శ్రీను కామెంట్స్
బుల్లితెర ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతోమంది కళాకారులు ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్వించడం జబర్దస్త్ కమెడియన్ల స్టైల్. ఈ బాటలోనే వెలుతూ బుల్లితెర ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడమే గాక తమ కెరీర్‌కి సరికొత్త బాటలు వేసుకుంటున్నారు ఈ నయా జనరేషన్ కమెడియన్లు. ఇక ఇందులో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ లాంటోళ్ళు బాగా సీనియర్లు. జడ్జ్ స్థానంలో నాగబాబు, రోజా కూడా అంతే.

ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ.. ఏకంగా నాగబాబు
సాధారణంగా జబర్దస్త్ కమెడియన్స్ ఇంటర్వ్యూలో ఇవ్వడం బాగానే చూసాం. కానీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ఇంటర్వూస్ ఇచ్చేస్తూ ఆన్‌లైన్ వేదికలపై కూడా జోరుగా సాగుతున్నారు జబర్దస్త్ కమెడియన్లు. ఇదే కోవలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు గెటప్ శ్రీను. ఇందులో నాగబాబు గురించి ఆయన కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

గెటప్ శ్రీనుపై నాగబాబు ఒపీనియన్
జబర్దస్త్ జడ్జ్ స్థానంలో కూర్చొని తెగ ఎంజాయ్ చేస్తుంటారు నాగబాబు. అందరు కమెడియన్ల స్కిట్స్ చూసి ఖుషీ ఖుషీగా నవ్వేస్తుంటారు. ఈయనకు జబర్దస్త్ కామెడియన్లందరూ ఇష్టమే. కానీ గెటప్ శ్రీనుపై మాత్రం ప్రత్యకమైన ఇష్టం. జబర్దస్త్‌లో తాను బాగా అభిమానించే వ్యక్తి గెటప్ శ్రీను అని ఇటీవలే నాగబాబు ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు.

నాగబాబు సార్ అలా అనడానికి కారణం
ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను, మెగా బ్రదర్ నాగబాబు గురించి మాట్లాడారు. తానంటే అభిమానమని నాగబాబు సార్ అనడానికి
ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని చెప్పాడు. ఆయనకు కామెడీ మీద అపారమైన అనుభవముందని, తనను దాదాపు ఎనిమిదేళ్లుగా ఆయన చూస్తూ వస్తున్నారని పేర్కొన్నాడు గెటప్ శ్రీను.

గోవాలో ఆ పని.. పాపం నాగబాబు
తాను కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను కడుపుడ్డా నవ్విస్తానని అంటున్నాడు గెటప్ శ్రీను. ఇదే నేపథ్యంలో తాను గతంలో చేసిన ఓ పనికి నాగబాబు తెగ బాధ పడవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు. తామంతా ఓ సారి గోవాకు వెళ్ళమని, అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో నాగబాబును తెగ నవ్వించేశానని అన్నాడు. దీంతో 2 నెలల పాటు నాగబాబు వాయిస్ కూడా పోయిందని, అలా ఆయన బాధకు కారణమయ్యానని అన్నాడు గెటప్ శ్రీను.

అక్కడే కాదు ఇక్కడ కూడా
ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్లు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా రాణిస్తున్నారు. ఈ మార్గంలోనే ప్రయాణిస్తూ సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులు కలిసి 'త్రీ మంకీస్' అనే పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమా అప్‌డేట్స్ అన్నీ యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి.