twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లూసిఫర్ వెజిటేబుల్ తాలి.. గాడ్‌ఫాదర్ హైదరాబాద్ బిర్యాని’

    |

    మలయాళంలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా రూపొందించిన గాడ్‌ఫాదర్ చిత్రం భారీ విజయం వైపుగా దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకొన్న ఈ సినిమా విజయాన్ని చిత్ర యూనిట్ జరుపుకొన్నది. గాడ్‌ఫాదర్ సక్సెస్ మీట్‌లో సీఎం పీకేఆర్ పాత్రను పోషించిన సీనియర్ నటుడు, సిరివెన్నెల సర్వదమన్ బెనర్జీ ఎమోషనల్‌గా మాట్లాడారు. సర్వదమన్ భావోద్వేగంగా మాట్లాడుతూ..

    దర్శకుడు మోహన్ రాజా నమ్మకాన్ని

    దర్శకుడు మోహన్ రాజా నమ్మకాన్ని


    గాడ్‌ఫాదర్ సినిమా సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికి నమస్కారం. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరితో పనిచేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు మోహన్ రాజా విజన్‌కు తగినట్టు అందరం నటించామనే ఫీలింగ్‌తో ఉన్నాం. పీకేఆర్ సినిమా మొత్తంగా 8 నిమిషాల నిడివి ఉంటుంది. కానీ ఆ పాత్ర ప్రభావం.. ఆ పాత్ర వల్ల వచ్చిన ఎమోషన్స్, ట్విస్టులు సినిమాకు కీలకంగా మారాయి. 75 ఏళ్ల వయసులో 45 ఏళ్ల వయసున్న పాత్ర చేయడం గొప్ప అనుభూతి అని సర్వదమన్ బెనర్జీ చెప్పారు.

    కృష్ణ పరమాత్ముడిలా చిరంజీవి

    కృష్ణ పరమాత్ముడిలా చిరంజీవి


    గాడ్‌ఫాదర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన చిరంజీవికి హ్యాట్సాఫ్. నేను లూసిఫర్ చూశాను. కానీ గాడ్‌ఫాదర్ సినిమాకు దానికి ఎక్కడా పోలికలు లేవు. ఈ సినిమాకు కృష్ణపరమాత్ముడిలా చిరంజీవి దివ్యానుభూతిని కల్పించారు. మౌనంగా, కేవలం కంటిచూపుతో బ్రహ్మ పాత్ర చేసిన మ్యాజిక్‌ను ప్రతీ ఒక్కరు చెప్పుకొంటున్నారు. మలయాళంలో ఆ పాత్రను అండర్ ప్లే చేస్తే.. చిరంజీవి ఆ పాత్రను ఎక్కడో పైస్థాయిలో ప్లే చేశారు అని సర్వదమన్ బెనర్జీ అన్నారు.

    హైదరాబాద్ బిర్యానీలా గాడ్‌ఫాదర్

    హైదరాబాద్ బిర్యానీలా గాడ్‌ఫాదర్


    దర్శకుడు మోహన్ రాజా రూపొందించిన సినిమా చూసినప్పుడు గొప్ప అనుభూతి కలిగింది. మలయాళంలో మంచి వెజిటేబుల్ తాలి. గాడ్‌ఫాదర్ ఫ్యాబులస్ హైదరాబాద్ బిర్యాని అని అనిపించింది. బ్రహ్మ అంటే భారతీయ సంస్కృతిలో వేదాలకు, ఉపనిషత్తులకు మూలం. అలాంటి పాత్రను చిరంజీవి అద్బుతంగా పోషించారు. బ్రహ్మ సర్వంతర్యామి అనే ఫీలింగ్‌ను మరోసారి తెర మీద కల్పించారు అని సర్వదమన్ బెనర్జీ తెలిపారు.

    సినిమాను బ్లాక్‌బస్టర్‌గా

    సినిమాను బ్లాక్‌బస్టర్‌గా

    గాడ్‌‌ఫాదర్‌లోని బ్రహ్మ పాత్రను మరొకరు ఊహించని విధంగా పండించారు. ఆయన ఫెర్ఫార్మెన్స్ హ్యాట్పాఫ్. ఆయన తన పాత్రను అద్బుతంగా చేయడమే కాకుండా సినిమాను బ్లాక్‌బస్టర్‌గా మలిచారు. ఈ చిత్రంలో నటించిన సత్యదేవ్, ఇతర నటీనటులు బాగా నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు బాగుంది. అన్ని అంశాలు ప్రేక్షకులను మెప్పించే విధంగా కుదిరాయి అని బెనర్జీ పేర్కొన్నారు.

    అనంతపురంలో మీట్‌లో

    అనంతపురంలో మీట్‌లో


    చిరంజీవి గురించి చివరగా ఒక మాట చెప్పాలి. అనంతపురంలో మీట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. తాను మాత్రమే బ్రహ్మను కాదు.. నా ముందు ఉన్న ప్రతీ ఒక్కరు, నా అభిమాని కూడా బ్రహ్మనే అని చెప్పారు. ఆ సందేశాన్ని సినిమా కూడా చెప్పింది. సినిమాలో హీరో జర్నీ పరమార్థమే గాడ్‌ఫాదర్ సినిమా అని సర్వదమన్ బెనర్జీ అన్నారు.

    English summary
    Godfather success meet: Sarvadaman D Banerjee emotional speech about Chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X