Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
రజనీకాంత్ మూవీలో విలన్‌గా.. హీరో గోపిచంద్ సమాధానం ఇదే...
టాలీవుడ్‌లో సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న హీరో గోపిచంద్ మళ్లీ విలన్‌గా నటించేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. తమిళంలో రజనీకాంత్ నటించే చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రను పోషిస్తున్నారనే వార్త ఇటీవల వైరల్ అయింది. గతంలో విలన్ పాత్రలను అద్భుతంగా పడించిన క్రెడిట్ గోపిచంద్‌కు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలన్‌గా నటిస్తున్నారనే వార్త నమ్మేటట్లు చేసింది.
అయితే తాను మళ్లీ విలన్‌గా నటిస్తున్నట్టు వస్తున్న వార్తలపై గోపిచంద్ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదు. అదంతా అవాస్తవం. రజనీసార్ సినిమాలో నటిస్తున్నట్టు వార్త ఎలా పుట్టిందో అర్ధం కాలేదు. అయితే అన్నాతే డైరెక్టర్ సిరితాయి శివ నాకు క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం తరుచుగా కలుసుకొంటాం. అందువల్లనే మీడియా ఊహించుకొని ఉండొచ్చు అని గోపిచంద్ తెలిపారు.

గత కొద్దికాలంగా నా సినిమాకు డైరెక్ట్ చేయాలని శివ అంటున్నాడు. కానీ కోలీవుడ్‌లో ఆయన బిజీ ఉండటం వల్ల సాధ్యం కావడం లేదు. సరైన స్క్రిప్టు ఉంటే మా ప్రాజెక్ట్‌కు రూపం కల్పించాలనే ప్లాన్‌తో ఉన్నాం అని గోపిచంద్ అన్నారు. గతంలో శివ, గోపిచంద్ కాంబినేషన్‌లో శౌర్యం, శంఖం చిత్రాలు భారీ విజయాలను అందుకొన్ని సంగతి తెలిసిందే.