గోపీచంద్ మూవీ నుంచి సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్: అదే వదలబోతున్నారు
చాలా కాలంగా హిట్ లేక సతమతం అవుతున్నాడు టాలెంటెడ్ హీరో గోపీచంద్. వరుస పెట్టి ఎన్నో సినిమాల్లో నటించినా అతడికి సక్సెస్ దూరంగానే ఉంటోంది. దీంతో జయాపజయాలతో సంబంధం లేకుండా మూవీలు చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ మారుతితో కలిసి 'పక్కా కమర్షియల్' అనే సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయింది. ఇంతలో కరోనా రెండో దశ ఎక్కువ అవడంతో చిత్రీకరణను నిలిపి వేశారు.
సరికొత్త కాన్సెప్టుతో తెరకెక్కుతోన్న 'పక్కా కమర్షియల్' మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ఓ సర్‌ప్రైజ్ రాబోతుందట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆ అప్‌డేట్ ఏమై ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు చిత్ర నిర్మాత బన్నీ వాస్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇది కాని పక్షంలో 'పక్కా కమర్షియల్' సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు. దీంతో ఆ ఆప్‌డేట్‌పై ఆసక్తి నెలకొంది.

కమర్షియల్ పంథాలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా రూపొందుతోన్న 'పక్కా కమర్షియల్' మూవీలో గోపీచంద్ లాయర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రకటన సమయంలో దీన్ని అక్టోబర్‌లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట. అందులో ఒకరు గ్లామరస్ క్వీన్ రాశీ ఖన్నా కాగా.. మరొకరు తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











