‘పెళ్లికి ముందే గర్బవతి.. వద్దంటున్నా ఆ వయసులోనే అబార్షన్’
తెలుగు సినిమా ఇండస్ట్రీకి డ్రింకర్ సాయి చిత్రం ద్వారా పరిచయమైన సినీ హీరో ధర్మ మహేష్, ఆయన భార్య గౌతమీ చౌదరి మధ్య దాంపత్య విబేధాలు మరింత ముదిరాయి. గత కొద్ది వారాలుగా తన భర్తతో ఉన్న వివాదం గురించి, ఆయన అక్రమ సంబంధాల గురించి మీడియాకు ఎక్కిన ఆమె గురించి భర్త ధర్మ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాంతో ఈ భార్యభర్తల గొడవ మరింత రచ్చగా మారింది. గౌతమి కూడా చేసిన షాకింగ్ ఆరోపణల నేపథ్యంలో ధర్మ చెప్పిన విషయాలు షాకింగ్‌గా మారింది. అయితే ధర్మ చెప్పిన విషయాల్లోకి వెళితే..
తన భార్య గౌతమికి చాలా చెడు అలవాట్లు, వ్యవహారాలు ఉన్నాయి. నా కళ్ల ముందే తాగి.. మరో వ్యక్తితో కారులో వెళ్లింది. మీడియాలో వచ్చిన లైవ్ కార్యక్రమాల వల్లే గొడవలు ముదిరాయి. అప్పటి నుంచి మేమిద్దరం దూరంగా ఉన్నాయి. ఎవరి ప్రైవసీని వారు ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. తన జీవితం తనది.. నా ప్రపంచం నాది అని అనుకొన్నాం. ఆ తర్వాత గౌతమి ప్రవర్తించిన తీరుతో చాలా ఇబ్బంది పడ్డాను. నా భార్య తప్పతాగి చాలా దారుణంగా బిహేవ్ చేసింది. ఫుల్లుగా తాగి నా ఫోటోలను కాల్చివేసింది అని ధర్మ మహేష్ చెప్పారు.

పెళ్లికి ముందు మేము డేటింగ్ చేసుకొన్నాం. ప్రేమించుకొన్న తర్వాత సహజీవనం చేశాం. పెళ్లికి ముందే గర్బవతి అయింది. అయితే ఆ సమయంలో ఆమె వయసు 19 ఏళ్లే. ప్రెగ్నెంట్ తర్వాత నేను వారిస్తున్నా.. ఆమె అబార్షన్ చేయించుకొన్నది. ఆ విషయం నాకు నచ్చలేదు. అబార్షన్ చేయించుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అని ధర్మ తెలిపారు.
తన భార్యకు, తనకు మధ్య గొడవలో ఓ సీనియర్ జర్నలిస్టు తలదూర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నా భార్య వ్యవహారంలో ఆయనకు సంబంధం ఏమిటి? ఆయనను ఒకసారి కలిశాను. కానీ ఆయన చాలాసార్లు గౌతమి ఇంటికి వెళ్లారు. మా వివాదంలో ఆయన తలదూర్చడం సరికాదు అని ఆయన తీవ్రంగా స్పందించారు.
ఇక తన డబ్బుతోనే తనపైనే ఆరోపణలు చేస్తుంది. తనపై ఎదురు తిరుగుతున్నది. ఇప్పటి వరకు గౌతమి చెప్పిన విషయాల్లో 90 శాతం అబద్దాలే ఉన్నాయి. కేవలం 10 శాతం మాత్రమే నిజాలు ఉన్నాయి. ఆమె నడిపే బిజినెస్ కూడా నాదే. ఆ బిజినెస్ ఐడియా కూడా నాదే అని ధర్మ చెప్పారు.


Click it and Unblock the Notifications











