Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సింగిల్ కట్ లేకుండా గుణ 369.. ఆగస్టు 2న కార్తీకేయ మూవీ గ్రాండ్‌గా రిలీజ్
RX100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ నాయికగా తెరకెక్కిన చిత్రం గుణ 369. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రమిది. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. గురువారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది . ఆగస్ట్ 2న చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం . మంచి సినిమా చేశామని సంతృప్తి మాలో ఉంది. ట్రైలర్ చూసిన వారందరూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు.ఇప్పటికే పాటలకు ఎక్సట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తొలి పాటను స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు, రెండో పాటను ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం, అలీ,మూడో పాటను దర్శకేంద్రులు కే రాఘవేంద్ర రావు విడుదల చేశారు. అలాగే ట్రైలర్‌ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను ఆవిష్కరించారు అని అన్నారు.
దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ నాలుగ్గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యథార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్షకుడి గుండెను తాకుతుంది అని అన్నారు.
సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్,
కెమెరామెన్: 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ రామ్,
ఆర్ట్ డైరెక్టర్ : జీయమ్ శేఖర్,
ఎడిటర్ : తమ్మిరాజు ,
డాన్స్ : రఘు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : సత్య కిశోర్, శివ మల్లాల.